మోదీ ప్రారంభించిన రైల్వే స్టేషన్.. రోజు ఇద్దరే ప్రయాణికులు.. 20 రూపాయల ఆదాయం..?

praveen

రైల్వేస్టేషన్లో రోజు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఏ  రైల్వే స్టేషన్ లో అయినా ఎప్పుడు ప్రయాణికులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రైల్వే ప్రయాణాలలో తక్కువ ఖర్చుతో కూడుకున్న కాబట్టి... ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు జనాలు. రైల్వే ప్రయాణాలు చేయడం వల్ల ప్రయాణ భారం తగ్గడంతోపాటు... సురక్షితమైన ట్రాఫిక్ లేని ప్రయాణం చేయవచ్చు. అయితే రైల్వే ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుందన్న  విషయం తెలిసిందే. ఎంత చిన్న రైల్వేస్టేషన్ అయినా రోజు వారి ఆదాయం భారీగానే ఉంటుంది. అందువల్ల రోజురోజుకు రైల్వే పై కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూనే వస్తుంది. అటు ప్రజలకు కూడా రైల్వే సేవలు రోజురోజుకు మెరుగు పడుతున్నాయి. 

 

 

 అయితే బస్సులతో పోలిస్తే రైల్వే టికెట్ చార్జీలు అతి తక్కువ ఉండడంతో... రైల్వే పైన ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు జనాల్ని. ఇక బస్సుల లాగా ఎక్కువమంది కాకుండా రైలు కాస్త తక్కువ ప్రయాణికులు ఉండడం జరుగుతుంది కాబట్టి రైల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లాలి అనుకునేవారు రైలు ప్రయాణమె  ఎంచుకుంటారు. కానీ ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ లో మాత్రం రోజుకు కేవలం ఆదాయం 20 రూపాయలు ఆదాయం వస్తుంది  అంటే ఎవరికైనా విస్మయం కలగక మానదు. కేవలం రైల్వేస్టేషన్లో ఇద్దరంటే ఇద్దరు ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతకీ ఈ  రైల్వే స్టేషన్ సాదాసీదా అనుకునేరు.. ప్రధానమంత్రి స్వయంగా ఈ రైల్వేస్టేషన్ ప్రారంభించారు. ఇంతకీ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అంటారా  అది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 

 

 

 ఒడిశాలోని బలంగిర్ జిల్లా లోని బీచుపల్లి  రైల్వే స్టేషన్ లో ఘటన చోటుచేసుకుంది. ఈ రైల్వే స్టేషన్ ను సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినప్పటికీ రైల్వే స్టేషన్ పరిస్థితి మాత్రం మార లేదు.ఓ  సామాజిక కార్యకర్త ఆర్బీఐ చట్టం ద్వారా ఈ స్టేషన్ గురించిన సమాచారాన్ని రాబట్టారు. రైల్వే స్టేషన్ నుంచి  రోజు మొత్తం మీద ప్రయాణించేది  ఇద్దరు మాత్రమేనని వారి ద్వారా కేవలం 20 రూపాయల ఆదాయం మాత్రమే రైల్వేస్టేషన్కు వస్తుందని అధికారులు తెలిపారు. బలంగిర్ నుంచి బీచుపల్లి  కి రైల్వే లైన్ వేయడానికి ఇక్కడ స్టేషన్ నిర్మించడానికి 115 కోట్లు ప్రభుత్వానికి ఖర్చయిందని... తెలిపారు అధికారులు. కానీ స్టేషన్ నిర్వహణకు మాత్రం రోజుకు ఎంత ఖర్చవుతుందో మాత్రం అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: