బాబు ఆయువు ప‌ట్టు అంతా జ‌గ‌న్ లాగేశారా...!

VUYYURU SUBHASH

ప్రజలు కష్టాలు తెలుసుకుని వాటిని పరిష్కరించిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు. అయితే ప్రజలు కష్టాలు తెలుసుకుని వారి కోసం పనిచేసే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఇక అలా అరుదుగా ఉండే నేతల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఒకరని చెప్పొచ్చు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కష్టాలు దగ్గర ఉండి చూసి, వారి కష్టాలని తీరుస్తానని హామీ ఇచ్చి...అధికారంలోకి వచ్చాక ఒక్కో కష్టాన్ని ఒక్కో విధంగా తీరుస్తూ ముందుకెళుతున్నారు. తొలిసారి అధికార పీఠం ఎక్కిన కూడా ప్రజల కోసం అనేక పథకాలని, నిర్ణయాలని తీసుకున్నారు.

 

రాష్ట్రంలోని ప్రతి వర్గం వారికి ఏం కష్టాలు ఉన్నాయో తెలుసుకుని మరి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల అన్నీ వర్గాల ప్రజల జగన్‌కు మద్ధతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటినుంచో టీడీపీ అండగా ఉన్న బీసీ వర్గాలు జగన్‌కు జై కొడుతున్నారు. కేవలం 7 నెలల్లోనే తమ కోసం అనేక పథకాలు తీసుకురావడం వల్ల వారు జగన్‌కు ఇంకా దగ్గరవుతున్నారు.

 

ఇప్పటికే అందరితో పాటు అందే పథకాలు బీసీలకు ఇస్తూనే...ప్రత్యేకంగా వారి కోసం మరిన్ని పథకాలని అమలు పరుస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన జగన్...ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ పేరిట యువకులకు సబ్సీడీ లోన్లు ఇస్తున్నారు. తాను పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు ప్రాణాన్ని ఫణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళుతున్న మత్స్యకారులను ఆదుకొనే విధంగా, వేట నిషేధ కాలంలో ప్రతి మత్స్య కార్మికుడికి రూ. 10 వేలు ఇచ్చారు.

 

ఇక ఇప్పుడు మగ్గంపై ఆధార పడి జీవిస్తున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సాయం ప్రతి ఏటా అందనుంది.  ఈ పథకం డబ్బులని ఒకేసారి చేనేత కార్మికుల ఎకౌంట్ లల్లో డిపాజిట్ చేశారు. ఇక త్వరలోనే నాయి బ్రాహ్మణులకు, దర్జీలకు, రజకులకు కూడా ఆర్ధిక  సాయం చేయనున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో బీసీలకు మరిన్ని పథకాలు అందించి వారి పూర్తి మద్ధతు పొందాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో అధికంగా ఉన్న బీసీలు జగన్‌కే జై కొడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: