ప్రియుడితో హద్దు దాటిన ‘ముద్దు’ ప్రాణం తీసింది...ఇదెంత ఘోరమంటే... ?

venugopal

ముద్దు ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే అవుతుంది. ఇక ఈ అధర చుంబనం వల్ల కలిగే లాభాల మాట అటుంచితే నష్టాలు కూడా ఉన్నాయట. ఇక ప్రేయసీప్రియుల మధ్య ఉన్న అసలైన ప్రేమను చూపించడానికి వాడుతున్న నయా ఆయుధం లిప్‌లాక్‌. ఇదిలా ఉంచితే ముద్దు వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని, శరీరంలో 10 నుంచి 15 కేలరీలు బర్న్ అవుతాయని చెబుతుంటారు. కానీ, ముద్దు ప్రాణం కూడా తీస్తుందనే సంగతి మీకు తెలుసా?

 

 

అయితే, ఫ్లోరిడాలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకోవల్సిందే. ఫ్లోరిడాలో నివసించే 17 ఏళ్ల అరియానా అథ్లెట్ కావడంతో ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటుంది. కాని ఒకరోజు ఉన్నట్టుండి గొంతు మంట, తీవ్రమైన తలనొప్పితో అనారోగ్యానికి గురైంది.. ఆమె తల్లిదండ్రులు సాధారణ వైరల్ ఫీవర్ అని భావించారట. ఈ నేపథ్యంలో ఆమెకు వ్యాధి సోకిందనే విషయాన్ని గుర్తించలేకపోయారు. వారం రోజుల తరువాత ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారి కనీసం నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.

 

 

అక్కడ బాత్‌రూమ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన, తన కాళ్లు కదల్చలేకపోతున్నానని, అవి ఉన్నట్లే తెలియడం లేదని చెప్పింది. దీంతో వైద్యులు ఆమె స్ట్రోక్ గురైందని భావించి మరో హాస్పిటల్‌కు తరలించారట. అక్కద కూడా అరియానా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టిందట. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమె ఎప్స్టీన్ బార్ వైరస్‌ బారిన పడినట్లు గుర్తించారు. దీన్నే ‘కిస్సింగ్ డిసీజ్’ అని కూడా అంటారని తెలిపారు. దీని వల్ల ఆమె మెదడు వాచిపోయి, పనిచేయడం మనేసిందన్నారు. అందుకే ఆమె చివరి క్షణాల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడిందన్నారు.

 

 

ఇక ఆమె బ్రతకదని వైద్యులు తేల్చేసారట. ఈ వ్యాధి ఎక్కువ మనుషుల లాలాజలం నుంచి వ్యాపిస్తుంది. అదర చూంబనం చేసే వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేగాక, ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల తినే ఆహారాన్ని తిన్న, వారి తాగిన గ్లాసులు ఉపయోగించినా వ్యాధి సోకుతుంది. అయితే, ముద్దులతోనే త్వరగా ఈ వ్యాధి సోకుతున్న నేపథ్యంలో దీన్ని ‘కిస్సింగ్ డిసీజ్’గా పేర్కొన్నారు. అరియానాకు ఈ వ్యాధి ఏ విధంగా సోకిందనేది ఎవరికీ తెలియదు. కానీ, ఇది ముద్దులతోనే సంక్రమించే అవకాశం ఉండటంతో ఆమె మరణానికి అదే కారణం కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: