ఆర్మీ జవానులే లక్ష్యంగా ఉగ్రదాడులు - 54 మంది మృతి

Balachander
దేశాన్ని కాపాడే ఆర్మీ జవానుపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి.  ఏ దేశంలో చూసుకున్నా.. ఆర్మీ జవానులపై ముష్కరులు దాడులు చేస్తున్నారు.  దేశాన్ని రక్షించే క్రమంలో జవానులు తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు.  తమ ప్రాణాలు పోయినా సరే.. దేశ రక్షణే ధ్యేయంగా యుద్ధం చేస్తున్నారు.  ప్రతిఘటిస్తున్నారు.  ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు.  


అది ఇండియా కావొచ్చు.. ఆఫ్రికా కావొచ్చు.  ఎక్కడైనా ఒకటే.. ఆర్మీ జవాన్ అంటే దేశం కోసం ప్రాణాలు కోల్పోవాల్సిందే.  తాజాగా ఆఫ్రికా దేశంలోని మాలిలో ఉగ్రవాదులు జవానులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి.  ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో 53 మంది జవానులు మరణించగా.. ఒక సాధారణ పౌరుడు మరణించాడు.  పదిమందికి పైగా గాయపడ్డారు.  మాలిలో జరిగిన ఈ ఉగ్రదాడి వెనుక ఆల్ ఖైదా హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది.  


మాలిలో ఉగ్రవాదుల నుంచి ఆ దేశాన్ని రక్షించేందుకు ఫ్రెంచ్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.  ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నది.  ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నట్టుగా అక్కడి ప్రభుత్వం చెప్తున్నది.  మిలిటరీ పోస్టులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు.  అయితే, ఈ దాడి చేసింది తామే అని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోయినా దీని వెనుక ఆల్ ఖైదా హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది.  


గత సెప్టెంబర్ నెలలో బుర్కినో ఫాసోలో ఇద్దరు తీవ్రవాదులు జరిపిన దాడిలో 38 మంది జవానులు ప్రాణాలు కోల్పోయారు.  విచక్షణా రహితంగా కాల్పులు జరపడం.. ఆత్మాహుతి దాడులు చేయడం వంటివి చేస్తూ జవానులు మరణానికి కారణం అవుతున్నారు. ఉత్తర మాలి  ఏరియాలో ఆల్ ఖైదా, ఐసిస్ తీవ్రవాదుల ప్రభావం అధికంగా ఉన్నది.  ఆల్ ఖైదా చీఫ్, ఐసిస్ చీఫ్ లు హతమైన ఈ ఉగ్రవాదం మాత్రం ఆగడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: