ఆ టీడీపీ మాజీ మంత్రి రాజకీయ జీవితం క్లోజ్....

VUYYURU SUBHASH
2019 ఎన్నికల ఫలితాలు చాలామంది టీడీపీ నేతలకు కోలుకోలేని దెబ్బ వేశాయి. అందుకే ఓటమి తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా అయిపోయారు. ఇక తమ కుమారులకు ఎన్నికల్లో నిలబెట్టి వారిని గెలిపించుకుని, వెనుక ఉండి రాజకీయం చేద్దామనుకున్న సీనియర్ నేతలకు కూడా చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఆ దెబ్బకు వారు రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు రాజకీయాలు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.


లాయర్ గా జీవితాన్ని మొదలుపెట్టిన బొజ్జల...ఎన్టీఆర్ పిలుపు మేరకు 1989లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అదే ఊపులో 1994,1999 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అలాగే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి కూడా పని చేశారు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు బొజ్జల కూడా ఉన్నారు. అప్పుడు ఆయనకు కూడా గాయాలు అయ్యాయి.


2004లో మళ్ళీ బొజ్జల శ్రీకాళహస్తి నుంచే పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్ధి ఎస్‌సి‌వి నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించారు. 2014లో చంద్రబాబు కేబినెట్ లో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అనారోగ్య కారణాలు వల్ల బాబు...బొజ్జలని కేబినెట్ నుంచి తప్పించారు. ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయిన బొజ్జల...మొన్న ఎన్నికల్లో కుమారుడు సుధీర్ రెడ్డికి టికెట్ ఇప్పించి పోటీలో దింపారు. కానీ అనుహ్యాంగా సుధీర్ వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.వైసీపీ అభ్యర్ధి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.


ఈ ఓటమి తర్వాత బొజ్జల గానీ, సుధీర్ గానీ బయట కనపడలేదు. అయితే బొజ్జల వయసు మీద పడటం, అనారోగ్య కారణాలతో పూర్తిగా రాజకీయాలకు దూరమైపోయినట్లు తెలుస్తోంది. మళ్ళీ బొజ్జల టీడీపీలో కనిపించడం కష్టమే. ఇంతటితో ఈ టీడీపీ సీనియర్ నేత రాజకీయం ముగిసిపోయినట్లే.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: