పిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్ కి వచ్చి... కానిస్టేబుల్ వేలు కొరికేసాడు. ఎందుకో తెలుసా.?

praveen

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి  సైకో లా మారిపోయాడు. ఫిర్యాదు కోసం వచ్చి కానిస్టేబుల్ పై దాడి చేసాడు. ఏకంగా కానిస్టేబుల్ చిటికెన వేలు కొరికేసి కింద పడేసాడు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయాడు ఆ సైకో. పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని స్థానిక  నాయి బ్రాహ్మణ కాలనీకి చెందిన డుంగ్రోతు  మస్తాన్ మరో ఇద్దరితో కలిసి మంగళవారం అర్థరాత్రి ఖమ్మం   జిల్లా ఒకటో పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ క్రమంలోఅక్కడి పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుల్ కి పిర్యాదు నిమిత్తం మాట్లాడుతున్నాడు మస్తాన్ అనే వ్యక్తి. ఇంతలో మస్తాన్ సైకోలా మారిపోయాడు. 

 

 

 

పిర్యాదు తీసుకుంటున్న కానిస్టేబుల్  చేయి అందుకుని అతని చిటికన వేలు కొరికేసాడు. మొత్తం చిటికెన వేలును తెగిపోయేలా  కోరికి  కింద పడేసాడు. ఆ తర్వాత తొడ భాగంలో  భ కూడా కొరికాడు. దీంతో ఒక్కసారిగా షాక్కి గురైన ఏఎస్ఐ నాగేశ్వరరావు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే మస్తాన్ ఏఎస్సై  నాగేశ్వరావు పైన కూడా దాడి చేశాడు . స్టేషన్ అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించాడు. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మస్తాన్ ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదని అంతకు ముందు కూడా చాలాసార్లు మస్తాన్ ఇలా ప్రవర్తించాడని తెలిపారు. కావాలనే  పోలీస్ స్టేషన్లో రోడ్లపై గొడవలకు దిగే వాడు అని అంటున్నారు పోలీసులు. 

 

 

 

 

 గత కొన్నేళ్లుగా మస్తాన్ ఇలాగే ప్రవర్తిస్తున్నాడు అని తెలిపారు. ఓసారి రైలు పట్టాల దగ్గర కూర్చొని రైలు పట్టాలపై రెండు కాళ్లు పెట్టడంతో కాళ్లపై నుంచి రైలు వెళ్లి రెండు కాళ్ళు తెగిపోయినట్లు తెలిపారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో మస్తాన్ పై కేసులు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. అయితే మస్తాన్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇలాంటి సైకో గా ప్రవర్తించే వ్యక్తి బయట తిరగడం వల్ల ప్రజలకు హాని కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: