ఆ చెట్టును చూసి జపాన్ ఇప్పటికి భయపడుతోంది..!!

Balachander
భారతదేశంలో నమ్మకాలు ఎక్కువ. ఏదైనా ఒక విషయాన్ని బలంగా నమ్మితే.. దానిని ప్రచారం చేయడంలో మనవాళ్లకు మించిన వారు ఉండరు. ఇలాంటి నమ్మకాలు దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. మనం కనిపించిన చెట్టుకు, పుట్టకు, రాయికి రప్పకు మొక్కుతాం. దేవతలుగా భావించి పూజలు చేస్తాం. ఇలా చేయడం మంచిదే. ఎందుకంటే, ప్రకృతి అంటేనే దేవత.

ప్రకృతి కి పూజలు చేయడం వలన మానవాళి ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతుంది. ఇక మనం ఒక ఇల్లు లేదా ఏదైనా కట్టడం కట్టాలి అనుకుంటే..ఆ స్థలంలో అడ్డుగా ఉన్న చెట్టు చేమను తొలగించి... కట్టడాలు నిర్మించుకుంటాము. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇలా చేయడం తప్పనిసరి అన్నది కొందరి అభిప్రాయం.

ఇక ఇదిలా ఉంటె, మనకు ఎలాంటి నమ్మకాలు ఉన్నాయో అలాంటి నమ్మకాలు అంటే అన్ని కావు, కొన్నింటిని ఓ దేశంవారు విపరీతంగా నమ్ముతారు. ఆ దేశం ఎదో తెలుసా.. జపాన్. అవును. జపాన్ లో కూడా నమ్మకాలు ఉన్నాయి. అలాంటి నమ్మకాల్లో ఒకటి చెట్టును నమ్మడం. అన్ని చెట్లకు పూజలు చేస్తారా అంటే కాదు. ఓ చెట్టును మాత్రం దేవుడి చెట్టుగా భావిస్తున్నారు. ఆ చెట్టు ఏమిటి.. ఎందుకు ఆ చెట్టుకు అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుసుకుందాం.

దాదాపు 700 సంవత్సరాల క్రితం జపాన్ లోని ఒకాసా ప్రాంతంలో కర్పూరం చెట్టును నాటారు. అప్పటినుంచి అది పెరుగుతూనే ఉంది. ఈ చెట్టు చాలా పెద్దదిగా పెరిగింది. 1910 వ సంవత్సరంలో ఈ చెట్టు ఉన్న ప్రాంతంలో రైల్వే స్టేషన్ ను నిర్మించారు. అదే కమాసియా రైల్వే స్టేషన్. అప్పట్లో ఈ చెట్టు ప్రయాణికులకు నీడను ఇస్తూ ఉండేది. కాలంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.

జపాన్ లో టెక్నాలజీతో పాటు జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రైల్వే స్టేషన్ ను పెంచుతూ వచ్చారు. తాజాగా కమాసియా స్టేషన్ కు తాకిడి ఎక్కువైంది. దీంతో స్టేషన్ ను ఎక్కువగా పెంచాలని అనుకున్నారు. అందులో భాగంగా స్టేషన్ లో ఉన్న కర్పూరం చెట్టును కొట్టివేయాలని భావించారు.

అయితే, ఆ చెట్టును కొట్టేందుకు ప్రయత్నించినా చాలా మంది ఏవేవో కారణాల వలన మృత్యువాత పడ్డారు. ఆ చెట్టుకు మహిమలు ఉన్నాయని, అందుకే చెట్టు జోలికి వెళ్ళినవారు మరణిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే, రైల్వే అధికారులు అవేమి పట్టించుకోకుండా ఆ చెట్టును నరికివేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకొని.. చెట్టును కొట్టివేయవద్దని.. బలవంతంగా కొట్టేస్తే.. అరిష్టం జరుగుతుందని అది జపాన్ కు మంచిది కాదని చెప్పడంతో.. ప్రజల నిర్ణయానికి అనుగుణంగా రైల్వే అధికారులు ఆ చెట్టును అలాగే ఉంచి స్టేషన్ ను పరిమాణం పెంచారు. ఆ చెట్టు కారణంగా కమాసియా రైల్వేస్టేషన్ జపాన్ లో మంచి పేరు సంపాదించుకున్నది. రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రతి ఒక్కరు చెట్టుకు నమస్కరించి వెళ్తున్నారు. ఆ చెట్టునుంచి వచ్చే గాలి వలన జబ్బులు కూడా నయం అవుతున్నాయట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: