ఉరవళ్లు తొక్కుతున్న వంశధార - కుడి, ఎడమ కాలువల ద్వారా 200 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల

SEEKOTI TRIMURTHULU
వంశధార కుడి, ఎడమ కాలువలకు బుధవారం నీరు విడుదల చేశారు. వంశధార కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్. నారాయణ నాయక్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో కలిసి గొట్టా బ్యారేజ్ హెడ్ రెగ్యూలేటర్ గేట్లను ఎత్తి వేయడంతో నీరు కాలువల్లోకి జలజలా మంటు ప్రవహించింది.దానితో రైతులంత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు పరిధి చివారు ప్రాంతాల వరకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. జిల్లాలో 1041 కిలోమీటర్ల మేర వంశధార విస్తరించి ఉందన్నారు. 


జిల్లాలో పెన్నెండు మండలాల పరిధిలో 1.48 లక్షల ఎకరాలకు ఎడమ కాలువ ద్వారా, 7 మండలాలకు కుడి కాలువ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వర్ష భావ పరిస్థితుల వలన బ్యారేజిలో నీరు లేకపోవడంతో ముందస్తుగా సాగుకు నీరు విడుదల చేయలేకపోయామన్నారు. కాని  రైతుల కోరిక మేరకు కలెక్టర్ , వంశధార ఎస్ఈ ల ఆదేశాల మేరకు వంశధార నీటిని విడుదల చేశామన్నారు. హిరమండలం గొట్టా బ్యారేజి వద్ద ప్రస్తుతం 37.4 మీటర్ల వరకు మాత్రమే నీటి మట్టం  ఉందన్నారు. నదిలోకి 1350 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని తెలిపారు. 


కుడి, ఎడమ కాలువల ద్వారా 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశామన్నారు. క్రమేపి క్యూసెక్కులు పెంచడం జరుగుగుతుందన్నారు. ఎడమ ప్రధాన కాలువ పరిధిలో1261 సాగునీటి చెరువులు, కుడి ప్రధాన కాలువల పరిధిలో 667 సాగునీటి చెరువు ఉన్నాయన్నారు. కాలువల ద్వారా మొదట చెరువులు నింపుకోవాలన్నారు. అనంతరం పిల్ల కాలువల  ద్వారా పంట పొలాలకు మళ్ళించుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గొట్టా బ్యారేజి కంట్రోల్ రూమ్ డీఈ ప్రభాకర్ రావు, ఏఈఓ లు జె. ప్రతాప్, ఎం.రాంబాబు , ఎం.కరిణ్ గొట్టా బ్యారేజి సిబ్బంది పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: