ఎడిటోరియల్ : ఎంపి, ఎంఎల్ఏ సీట్లపై చంద్రబాబు లెక్కేంటో తెలుసా ?

Vijaya

చంద్రబాబునాయుడులో ధీమా బాగానే కనిపిస్తోంది. రాబోయే ఫలితాల్లో తెలుగుదేశంపార్టీకి 130 ఎంఎల్ఏ సీట్లు, 20 ఎంపి సీట్లు ఖాయంగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు టిడిపి అధికారంలోకి వస్తుందనటంలో తనకేమాత్రం అనుమానం లేదన్నారు.

 

వైసిపి గెలుస్తుందన్నది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. 2014లో కూడా ఇలాంటి ప్రచారమే జరిగిందని అయితే చివరకు ఏం జరిగిందో అందరూ చూసిందే అన్నారు. రాబోయే ఫలితాల్లో కూడా అదే జరుగుతుందన్నారు. ఒకవైపు చంద్రబాబు అధికారంపై ధీమా వ్యక్తం చేస్తుంటే మరోవైపు తమ్ముళ్ళు మాత్రం జావకారిపోతున్న విషయం చూస్తున్నదే.

 

అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబే భిన్న వాదనలు వినిపిస్తున్న విషయం గమనార్హం. పైకి అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్న చంద్రబాబు ఆంతరంగికంగా మాత్రం అధికారంలోకి రావటం కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  పైగా చంద్రబాబు ఆరు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు చేశారు. అందులో పాల్గొన్న నేతల్లో అత్యధికం గెలుపు కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.

 

జరిగిన సమీక్షల్లో నల్గొండ, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల రూటే సపరేటన్నట్లు సాగింది. తమ ఓటమే ధ్యేయంగా పార్టీలోని నేతలే గోతులు తవ్వారని, ప్రత్యర్ధి పార్టీ వైసిపి అభ్యర్ధికి సహకరించారని కెఇ కృష్ణమూర్తి, భూమా బ్రహ్మనందరెడ్డి, కోట్ల సుజాతమ్మ ప్రత్యర్ధుల పేర్లు చెప్పి బహిరంగంగా  ఆరోపించటంతో పెద్ద గందరగోళమైంది. అభ్యర్ధులే స్వయంగా చెప్పటంతో పై నియోజకవర్గాల్లో గెలుపు అనుమానమే అని అర్ధమవుతోంది.

 

సమీక్షల్లో వాస్తవాలు ఇలా బయటపడుతుంటే చంద్రబాబు మాత్రం 130 ఎంఎల్ఏ సీట్లు, 20 ఎంపి సీట్లు వస్తాయని చెప్పటంతో తమ్ముళ్ళే ఆశ్చర్యపోతున్నారు. రెండోసారి అధికారంలోకి రావటం కష్టమని అర్ధమవటంతో చంద్రబాబు కూడా ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా గడిపేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోతే అర్జంటుగా కేంద్రం స్ధాయిలో ఏదో ఒక పధవి తెచ్చుకోకపోతే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేట్లు లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: