పరిటాల - వంగవీటి : వారసత్వ లేమి ?

KSK
తెలుగు రాజకీయాలలో పరిటాల మరియు వంగవీటి కుటుంబానికి మంచి ప్రత్యేకత ఉంది. పరిటాల కుటుంబం రాయలసీమ రాజకీయాలలో కీలకంగా ఉండేది.. వంగవీటి కుటుంబం ఉభయ గోదావరి జిల్లాలో ప్రభావితం చేసేవిగా ఉండేవి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిటాల కుటుంబం అంటే రాష్ట్రం మొత్తం తెలియని వారు ఉండరు అన్నట్టుగా మంచి బ్రాండ్ ఉండేది.


ఇదే క్రమంలో బెజవాడ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే వంగవీటి మోహన రంగా పేరు కూడా అదే స్థాయిలో ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా ఉండే పరిటాల..ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. రవి మరణించాక పరిటాల కుటుంబం అడపాదడపా తప్ప తర్వాత ఎప్పుడు కనబడలేదు.


అయితే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచి మంత్రి అయినా సునీత తాజా రాజకీయ పరిస్థితుల బట్టి తన తనయుడు పరిటాల శ్రీరామ్ ని ఎన్నికల బరిలోకి దింపి రవి వారసుడిగా రాజకీయాల్లోకి రాణించే ప్రయత్నాలు జరుపుతోంది సునీత. మరోపక్క వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా ఇటీవల వైసీపీ పార్టీలో కీలకంగా ఉండి  కొన్ని అనివార్య కారణాలవల్ల టీడీపీలోకి వెళ్లడం జరిగింది.


అయితే ఈ ఇద్దరి వారసుల రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఒకరు శత్రువుగా భావించే పార్టీలోకి వెళితే..మరొకరు తన తండ్రి పార్టీకి చేసిన కృషిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం వాడుకునే నాయకుడు పంచన చేరడంతో ...ఇరువర్గాలకు చెందిన అనుచరులు.. పరిటాల మరియు వంగవీటి వారసుల రాజకీయ ప్రయాణాన్ని చీదరించుకుంటూన్నట్లు టాక్ వినపడుతుంది. ఏది ఏమైనా ఈ ఇద్దరు వారసులు తండ్రికి తగ్గ తనయుడు కాదని అనేక మంది సీనియర్ రాజకీయ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: