టెక్సాస్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ విశేష స్పందన

SIBY HERALD
డాలస్: TX: అమెరికా  తెలుగు సంబరాల్లో భాగంగా నిర్వహించిన  నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు చక్కటి స్పందన లభించింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిపే  నాట్స్ తెలుగు సంబరాలకు టాంటెక్స్ సిద్ధమవుతోంది. దీని కోసం తెలుగువారందరిని ఒక్కటి చేసే క్రమంలో ముందస్తుగా అనేక ఈవెంట్స్, ఆటల పోటీలను నాట్స్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.. ఈ పరంపరను కొనసాగిస్తూ టాంటెక్స్ తో కలిసి నాట్స్ టెక్సాస్ లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. 26 టీమ్ లు,,250 మంది ఆటగాళ్లతో ఈ టోర్నమెంట్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఆస్టిన్, హ్యూస్టన్ నుంచి కూడా ఈ టోర్నమెంట్ కు విచ్చేశారు. నాట్స్ ప్రొఫెషనల్ కప్, నాట్స్ వాలంటీర్ కప్, నాట్స్ ఫన్ కప్, అనే మూడు రకాలు కప్స్ తో ఈ టోర్నమెంట్ ప్లాన్  చేసింది. నాట్స్ ప్రొఫెషనల్ కప్ కోసం హోరా హోరీగా సాగిన ఈ టోర్నమెంట్ లో థండర్స్ టీం విజేతగా నిలిచింది. రన్నరప్ గా రేంజర్స్ టీం నిలిచింది. నాట్స్ వాలంటీర్స్ ను కప్ ను స్పైకర్స్ 1  సొంతం చేసుకుంది. వీవీఎస్ 1 టీం రన్నరప్ గా నిలిచింది. నాట్స్ ఫన్ కప్ ను స్పైకర్స్2 టీం కైవసం చేసుకుంది. రన్నరప్ గా రెడ్ బుల్స్ టీం నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో ఉత్సాహంగా వాలీబాల్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ పాల్గొనడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది.



నాట్స్ సంబరాల స్పోర్ట్స్ డైరక్టర్ ఎన్.ఎమ్.ఎస్ రెడ్డి, నాట్స్ స్పోర్ట్స్ ఛైర్ శ్రీనివాస్ కాసర్ల ఈ టోర్నమెంటు విజయవంతానికి ఎంతో కృషి చేశారు. నాట్స్ చాలా సంవత్సరాల నుంచి  టోర్నమెంట్  నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు నిర్వహించిన టోర్నమెంట్ కు విశేష స్పందన వచ్చింది. ఎంతో క్రీడోత్సాహంతో వాలీబాల్ టోర్నమెంట్ పాల్గొన్నవారందరికి నాట్స్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. 



నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపునూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ ,కాన్ఫరెన్స్ సెక్రటరీ రాజేంద్ర మాదల,టాంటెక్స్ ప్రెసిడెంట్ చినసత్యం వెర్నపు నాట్స్ స్పోర్ట్స్ టీం పై ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ సంబరాల కాన్పరెన్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల స్వయంగా ఈ టోర్నమెంట్ కు హజరయ్యారు. విన్నర్స్, రన్నర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. మే 24 నుంచి 26 వరకు డాలస్ లో  జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని వారిని ఆహ్వనించారు. 



విజయ్ శేఖర్ అన్నే,కిషోర్ వీరగంధం, సంబరాల జాయింట్ సెక్రటరీ మహేశ్ ఆదిబొట్ల, నాట్స్ టీమ్ మెంబర్స్ రాజేంద్ర గొండి, హర్ష పిండి, వెంకట్ దండ, మురళీ పల్లబత్తుల, రఘు గుత్తికొండ, అభిరామ్ సన్నపురెడ్డి, వంశీ నాగళ్ల, పవన్ నెలుట్ల, సుబ్బు జొన్నలగొడ్డ, సురేష్ మండువ, మహేశ్ చొప్ప, రమేష్ రెడ్డి, మధు మల్లు, టాంటెక్స్ ప్రెసిడెంట్ చిన్న సత్యం వీరనపు, స్పోర్ట్స్ ఛైర్ వెంకట్ బొమ్మ తదితరుల మద్దతు ఈ టోర్నమెంట్ ను నాట్స్ దిగ్విజయంగా నిర్వహించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: