ఎడిటోరియల్ : తల్లా ? కొడుకా ? పెరిగిపోతున్న తలనొప్పి

Vijaya

అనంతపురం జిల్లాలో ఓ హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. అది మంత్రి పరిటాల సునీత, కొడుకు పరిటాల శ్రీరామ్ విషయమే టాకాఫ్ ది జిల్లా అయిపోయింది. రాబోయే ఎన్నికల్లో రాప్తాడు నుండి పరిటాల సునీత పోటీ చేయటానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అసలు సమస్య అక్కడే మొదలైంది. తనతో పాటు తన కొడుకు కూడా పోటీ చేస్తాడంటూ సునీత పట్టుబట్టారు. దాంతో చంద్రబాబు ఏం చేస్తారో అర్ధంకాక జిల్లా నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

 

వారసులకు టికెట్లు లేదని చంద్రబాబు గతంలోనే చెప్పారు. కానీ తాను చెప్పిన మాటను తానే ఉల్లఘించారు. అనంతపురం జిల్లాలోనే అనంతపురం ఎంపిగా ఎంపి జేసి దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డికి, తాడిపత్రి ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చంద్రబాబే లీకులిప్పింకున్నారు. ఇపుడిదే పెద్ద తలనొప్పైపోయింది. కొడుక్కి టికెట్ ఇప్పించుకోవటమన్నది సునీతకు ప్రిస్టేజ్ అయిపోయిందిపుడు.

 

జేసి బ్రదర్స్ వారసులకు టికెట్లు ఇస్తున్నప్పుడు తన కొడుక్కి మాత్రం టికెట్ ఎందుకివ్వరంటూ సునీత చంద్రబాబుపై ఒత్తిడి పెడుతున్నారు. తాను రాప్తాడులో పోటీ చేస్తే తన కొడుకు శ్రీరామ్ కల్యాణదుర్గం అసెంబ్లీకి పోటీ చేస్తారంటూ ఏకంగా నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసేసుకున్నారు. ఎప్పుడైతే సునీత కన్ను కల్యాణదుర్గంపై పడిందో సిట్టింగ్ ఎంఎల్ఏ హనుమంతరాయ చౌధరికి టెన్షన్ మొదలైంది.

 

సునీత లెక్క ఎలాగుందంటే సిట్టింగ్ ఎంఎల్ఏ ఉన్నా సరే చౌధరిని కాదని తన కొడుక్కు టికెట్ ఇప్పించుకోవాలన్న పట్టుదలతో ఉంది. దాంతో అటు చౌధరికి ఇటు చంద్రబాబుకు తలనొప్పులు మొదలయ్యాయి. కొడుక్కి టికెట్ కాదంటే సునీత ఏం చేస్తుందో తెలీదు. అలాగని సరేఅంటే చౌధరి ఎలా రియాక్టవుతారో అర్ధం కావటం లేదు.

 

పోనీ జేసి వారసులకు టికెట్లు రద్దు చేద్దామంటే ఇంకేమన్నా ఉందా ? జిల్లా మొత్తాన్ని కంపు చేసేస్తారని చంద్రబాబుకు భయం. దాంతో ఎవరికి సర్దిచెప్పాలో, ఎవరికి టికెట్ కోతేయాలో చంద్రబాబుకే అర్ధం కావటం లేదు. ఒకవైపేమో నామినేషన్ల దాఖలుకు తేదీ దగ్గరకొస్తోంది. మరోవైపుమో వివాదాలు పెరిగిపోతున్నాయి. జిల్లాలో సునీత మొదులు పెట్టిన చిచ్చును చంద్రబాబు ఎలా ఆర్పుతారో అని నేతలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: