పోలీసులకు చుక్కలు చూపించిన హుక్కా యాజమాన్యం!

Edari Rama Krishna
ఈ మద్య కొంత మంది డబ్బు సంపాదించడానికి రక రకాల మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈజి మనీ కోసం ఎన్నో అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు.  హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం, అక్రమ ఆయుధాల సరఫరా, భూ కబ్జాలు లకు పాల్పపడుతూ డబ్బు సంపాదిస్తున్నాు.  హైదరబాద్ కేంద్రంగా చేసుకొని కొంత మంది ఇక్కడ చట్ట వ్యతిరేకంగా హుక్కాను సరఫరా  చేస్తూ యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు.  జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న హెచ్టీసీ (హైదరాబాద్ టైమ్స్ కేఫ్) పబ్.

ఇక్కడ చట్ట వ్యతిరేకంగా హుక్కాను సరఫరా చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు, రైడింగ్ కు వెళ్లగా హుక్కా యాజమాన్యం పోలీసులకు చుక్కలు చూపించారు.   మొత్తం నాలుగు అంతస్తులున్న ఈ బిల్డింగ్ లో నాలుగో ఫ్లోర్ లో ఈ హుక్కా కేంద్రం ఉంది. పోలీసులు వస్తున్నారని తెలియగానే ముందుగానే ప్లాన్ ప్రకారం  దాదాపు 90 మీటర్ల పొడవైన తాడు ద్వారా హుక్కా సామాగ్రినంతా కిందకు చేరవేరుస్తారు నిర్వాహకులు.

తీరా పోలీసులు పైకి రాగానే అక్కడ ఏమీ కనిపించదు..దాంతో పోలీసులు ఖాళీ చేతులతో వెళ్లడం జరుగుతుంది.  ఈసారి పోలీసులు పక్కా వ్యూహంతో హుక్కా కేంద్రంపై అటాక్ చేసి హుక్కా సెంటర్ నిర్వాహకుల ఆట కట్టించారు. పై నుంచి హుక్కా సామాను కిందకు దింపే తాడును, విలువైన హుక్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.  అక్కడే తాళం వేసి ఉన్న గది తెరిచి చూడగా డబ్బు, హుక్కా సామాగ్రి ఉంది. చ్టీసీ నిర్వాహకుడు జీషాన్ తప్పించుకున్నాడని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: