ఏపి శాసనసభలో టిడిపికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానం పెడతారా? బిజెపి ఎమెల్సీ మాధవ్

చంద్రబాబు కు కొంచెం ఇబ్బంది కలిగితే ఆయన అవినీతి పరుడని ఆరోపణ లున్న సందర్భాల్లోనూ టిడిపి మద్దతు మీడియా గోరంతలు కొండంతలు చేయటం తన మీడియా గొట్టంద్వారా కోటి గొంతులతో ద్వనితో రణగణ ద్వని చేయటం జరుగుతుంది. గల్లా జయదేవ్, రామ్మ్మోహన్ నాయుడు కేసినేని నాని చెప్పిన విషయాలన్నీ జగన్మోహనరెడ్ది పలు సందర్భాల్లో 2014 నుండి వివరిస్తూ వస్తూనే ఉన్నారు. 



స్పెషల్ ప్యాకేజి ప్రపోజల్ కూడా చంద్రబాబు నాయుడిదేనని ప్రధాని అవిశ్వాసానికి నరెంద్ర మోడీ అవిశ్వాస తీర్మాననికి సమాధానగా చెప్పక మునుపే తెలుగుదేశం పార్టీ 13 జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక బిజెపి మహానాయకునికి సన్మానం చేసిన సంధర్భంగా చెప్పిన విషయమే. అత్యుత్సాహంతో అరున్ జైట్లికి అంగరంగ వైభవం గా సన్మానం చేసిన సంగతి ఉభయ తెలుగు రాష్ట్రాలకు తెలుసు. 

అంటే ఇప్పుడు అందులో చంద్రబాబు తప్పిదం ఉండటంతో అది బిజెపి మీద నెట్టెయ్యాలని వాదోపవాదనలు పలుసార్లు చేస్తే ప్రజల్ని తికమకపెట్టే విధంగా ప్రవర్తిస్తే- అదే పాయింట్ ను మద్దతు మీడియా ఊదరగొట్టేస్తే అది నిజమేనని జనం నమ్మే కృత్రిమ పరిస్థితులు నెలకొంటున్నాయి. అదే ప్రత్యేక ప్యాకేజి ప్రజలు అంగీకరిస్తే దాన్ని ప్రపోజ్ చేసింది తనే నని చెప్పటానికి క్రెడిట్ కొట్టేయ్యటానికి చంద్రబాబు ఈషణ్మాత్రం కూడా సిగ్గుపడరు. మోడీకి ఆ సలహా యిచ్చిందని ప్లేట్ ఫిరాయించెయాటం కూడా ఇప్పటికే జరిగి ఉండేది. 


ఇవన్నీ పరిష్కారం కావటానికి తెలుగుదేశంపై ఏపి ప్రతిపక్షాలన్నీ ఒకటై అవిశ్వాస తీర్మానం పెట్టి చెరిగేస్తే తప్ప తెలుగువాళ్లకు టిడిపి వాళ్ళ వారి మీడియా వలన ద్వనించే శబ్ధ కాలుష్యం వదిలిపోదు 

 
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ బీజేపీపై బురద జల్లేందుకు లోక్‌సభలో టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో తెలుగుదేశానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సమంజసం గా లేవని  తెలుగు దేశం, కాంగ్రెస్‌ల స్నేహబంధానికి లోక్‌సభ వేదిక గా నిలిచిందన్నారు. రాజీనామాలు చేసి వైసీపీ పనికిరాని పక్షంగా మిగిలిపోయిందని,  తమ తరపున పోరాటం చేయమని ప్రజలు ఎన్నుకుంటే పోరాటం సాగించకుండా అసెంబ్లీ సమావేశా లను బహిష్కరించడం దారుణమన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న తప్పిదమని, ఇప్పటికైనా ఆ పార్టీ సరైన నిర్ణయం తీసుకొని బిజెపి తో కలసి వస్తే  - టీడీపీపై తాము అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమని మాధవ్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: