నాయి బ్రాహ్మణులకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..!

KSK
గత కొన్ని దినాలుగా రాష్ట్రంలో సమ్మె చేస్తున్న నాయీ బ్రాహ్మణులు సమ్మెను ఉధృతం చేయాలని తాజాగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ని సచివాలయంలో అడ్డుకోవడం జరిగింది. ఈ నేపద్యంలో చంద్రబాబుపై ఇష్టానుసారంగా మాట్లాడిన క్రమంలో చంద్రబాబు అసహనానికి గురై వారి మాటలను  కట్టడి చేయడానికి సీరియస్ అయ్యారు. కాగా ఇటీవల కేశ ఖండన టికెట్టు 12 రూపాయల నుంచి 25 రూపాయల వరకు పెంచడం జరిగింది. నేపథ్యంగా నాయి బ్రాహ్మణులు 25 రూపాయలను ఒప్పుకునేది లేదని, ప్రతిపాదనలపై వెనక్కి తగ్గేది లేదని నాయి బ్రాహ్మణులు చెప్పడంతో సీరియస్ అయిన ముఖ్యమంత్రి నచ్చితే పని చేయండి లేకుంటే వెళ్లిపొమ్మని సీరియస్ గా చెప్పారు.

దీనితో వాగ్వివాదానికి దిగిన నాయి బ్రాహ్మణులు మాటలు తూలటంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలింది గా చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో సమ్మె చేస్తున్న నాయి బ్రాహ్మణులు విరమించారు. ఇదే విషయాన్ని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. కనీస వేతనంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వడంతో పాటు, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని కోరారు.

పదవి విరమణ చేసిన క్షురకులు 5000 రూపాయల చొప్పున ఫించన్ సౌకర్యం కల్పించాలని ప్రభుతానికి విన్నవించుకున్నారు. గత కొన్ని దినాలుగా నాయి బ్రాహ్మణులు సమ్మె చేయడంతో రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లో తలనీలాలు సమర్పించుకోవాలనుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా చంద్రబాబు నాయి బ్రాహ్మణులు సమస్యలపై స్పందించడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

మొత్తం మీద చంద్రబాబు కొంత కోపానికి గురైన గని రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో నాయి బ్రాహ్మణుల సంఘ పెద్దలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో జరిగిన ఘటన ను తీవ్రంగా తప్పుబట్టారు...చంద్రబాబుని క్షమించమని కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: