దిమ్మదిరిగిపోయేలా పరిటాల సునీత కుమార్తె పెళ్లి..

Prathap Kaluva
దివంగత నేత పరిటాల రవీంద్ర, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతల కుమార్తె డాక్టర్‌ పరిటాల స్నేహలత మరియు పరిటాల రవీంద్ర సోదరి వడ్లమూడి శైలజ కుమారుడు శ్రీహర్ష కు మధ్య వివాహ వేడుక  నిన్న పరిటాల రవీంద్ర స్వగ్రామం రామగిరి మండలం వెంకటాపురంలో ఘనంగా జరిగింది. మేళ తాళాలు, అర్చకుల వేద మంత్రాల నడుమ వధూవరులు వివాహబంధంతో ఒక్కటయ్యారు.


ఈ వేడుకకు బంధువులు, పరిటాల అభిమానులు, రాజకీయనాయకులు, వ్యాపార ప్రముఖులు మరియు తదితరులు హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. శనివారం ఉదయం వెంకటాపురం చేరుకున్న మంత్రి పితాని సత్యనారాయణ పరిటాల ఘాట్‌ను సందర్శించిన అనంతరం మంత్రి సునీతతో కలిసి పెళ్లి ఏర్పాట్లను  పరిశీలించారు. పెళ్ళికి మంత్రులు దేవినేని ఉమ,  అమర్నాథ్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు తో పాటు  హీరో  మంచు విష్ణు కూడా హాజరయ్యారు.


పెళ్ళికి వచ్చిన అతిధులు ఎండవేడికి ఇబ్బందిపడకుండా మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను అందించారు. దాదాపు ముప్పై రకాల ఆహార రకాలను అందుబాటులో ఉంచారు. కాగా ఈ వేడుకకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హాజరవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లను నిర్వహించారు. నలుగురు డీఎస్పీలు, 9 మంది సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 300 మందికి పైగా కానిస్టేబుళ్లు, 100 మందికి పైగా హోంగార్డులతో వివాహ వేడుక ప్రాంతాన్ని తమ అదుపులో ఉంచుకొని రక్షణ కల్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: