జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ఎంట్రీ వెనుక కేంద్ర పెద్దల హస్తం

KSK

తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ దినపత్రిక సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణపై ఒక కథనం ప్రచురించింది. జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ రంగప్రవేశం గనుక కేంద్రం చాలా పెద్ద స్కెచ్ వేసారూ అని ఆ కథనం యొక్క సారాంశం. ఈ నేపథ్యంలో గతంలో తమకు మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబునాయుడును రాష్ట్రంలో అవినీతి పరుడిగా చిత్రీకరించాలని ఆయన మీద వ్యూహ రచన చేశారు ఢిల్లీ బిజెపి పెద్దలు.


అదే సమయంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తెరపైకి తీసుకువచ్చారట. అయితే ఇట్టివల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై నోటికొచ్చినన్ని ఆరోపణలు చేశారు పవన్. దీని వెనుక కూడా మోదీ– షా ద్వయం ఉందని చంద్రబాబు అండ్‌ కో నిర్ధారణకు వచ్చారు.


పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబు పై వ్యతిరేక వైఖరి తీసుకోవడానికి గవర్నర్‌ నరసింహన్‌ కారణమనీ, కేంద్ర పెద్దలు గవర్నర్‌ ద్వారా ఈ ఆపరేషన్‌ నిర్వహించారనీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబుని కేసులలో ఇరికించి...రాష్ట్రంలో ఒక టిడిపి పార్టీని నిర్వీర్యం చేసి..ఆ స్థానంలో బీజేపీ పాగా వేయాలని చూస్తుందట.


ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మీద దృష్టిపెట్టి కాపు సామాజికవర్గానికి చెందిన  సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ తెరపైకి తీసుకువచ్చారు.... ..లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకుని పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించాలని చూస్తున్నారు బిజెపి పెద్దలు. ఇలా జేడీ లక్ష్మినారాయణను రాజకీయ రంగంలో అడుగుపెట్టించి ఒకేసారి చంద్రబాబుని వీలైతే జగన్ ని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారట బిజెపి నాయకులు. ఈ సందర్భంగా కుదిరితే ఎన్నికల ముందు బిజెపి జనసేన పార్టీతో పొత్తుపెట్టుకుని పోటీ చేయాలని భావిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: