సోమాలియా రాజధాని మొగదిషులో మారణహోమం

Edari Rama Krishna
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉగ్రవాదుల పైశాచిక చర్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఎక్కడ నుంచి ఎలా ఎటాక్ చేస్తారో ఎవ్వరికీ తెలియడం లేదు.  మన మద్యనే ఉంటూ మానవబాంబులుగా మారిపోతున్నారు.  తాజాగా సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. నిత్యం రద్దీగా ఉండే కె-5 కూడలిలోని సఫారీ బయట ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో దాడి చేశారు.

శక్తిమంతమైన ఈ పేలుడుకు సమీపంలోని భవనాలు తునాతునకలయ్యాయి.  బాంబుదాటికి ప్రజలు చెల్లా చెదురు అయ్యారు..మృతదేహాలు కాలి గుర్తుపట్ట లేనంతగా మారిపోయాయి. రక్తమోడుతున్న శరీరాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది.  ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 231కి చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, 75 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

అల్‌ఖాయిదా అనుబంధ ఉగ్రవాధ సంస్థ ‘అల్-షబాబ్’ ఈ దాడికి పాల్పడినట్టు ప్రభుత్వ అనుమానిస్తోంది.పేలుడు ధాటికి కూలిన భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉండే అవకాశం ఉండడంతో రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.  బాంబు దాడిపై అధ్యక్షుడు మహ్మద్ అబ్బుల్లాహి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: