టిడిపి తొత్తుగా మారి ప్రజల కిచ్చిన మాట నిలబెట్టుకోని పవన్ కల్యాణ్పవన్ కళ్యాణ్ మాటల్లో ఉన్న నిజాయతీ ఆయన చేతల్లో ఏమాత్రం కనిపించదు.  2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ తరపున వకాల్తా పుచ్చుకొని వారితో వారు ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చేలా చూస్తాన ని వాళ్ళని ప్రశ్నిస్తానని, ప్రశ్నించి సాధిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాగ్ధానం చేశారు. నాడు పవన్ కళ్యాన్ సమక్షం లోనే ఈ రెండు పార్టీల అధినాయకత్వాలు సం-యుక్తంగా ఆంధ్రప్రదేశ్ కు నాడు రాజ్యసభలో ప్రకటించినట్లు ప్రత్యెక హోదా అమలు పరుస్తా మని చెప్పారు. నరెంద్ర మోడీ ఏకంగా ఆంధ్రలో తమ సంకీర్ణాన్ని గెలిపిస్తే డిల్లీని మించే రాజధానిని నిర్మించటములో తగిన సహకారం అందిస్తానన్నారు.


పీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలకు ఆయన మిత్రపక్షమైన జనసేన సైతం అబాసుపాలుకావలసి వస్తుంది. సరైన అవగాహన ఒప్పందం అటు టిడిపి ఇటు బిజెపి తో ఉంటే జనసేన తన సహకారం అందించటం తప్పుకాదు. ఇలాంటి విషయాల్లో మొత్తం మీద పవన్ చేసిన తెలివితక్కున పనివల్ల టిడిపి అధికారములోకి రావటం జరిగింది అంతే కాదు పవన్ కళ్యాణ్ అందించిన   సహకారాన్ని మరిచిపోయింది.


పవన్ సహకారముతో వచ్చిన గెలుపు తన సామర్ధ్యమేనని బావిస్తూ "వాపును చూసి నిజంగా తన బలుపే" అనుకోవటం జనాన్ని మభ్యపెట్టటం కూడా జరిగింది. టిడిపి బిజెపి చేతుల్లో మోసపోయిన పవన్ కల్యాణ్ ఆయన జనసేనను జనం నమ్మటం అనేది ఇక ప్రశ్నార్ధకమే.ప్రధాన వాగ్ధానాలైన మిత్రపక్ష ప్రభుత్వం "ప్రత్యేక హోదా, డిల్లీ స్థాయిని మించిన విశ్వనగరం అమరావతి, దానికి అనేక సార్లు ప్రారంభోత్సవాలు, దానికోసం దేశదేశాలు తిరుగుతూ భయంకరమైన దుబారా వ్యయ భారం కష్టాల్లో ఉన్న తెలుగు వారిపై పడింది. రైతు ఋణ మాఫీ అనే వాగ్ధానం ఒక ప్రహసనంగా మారింది. అధికారులపై ప్రజా ప్రతినిధుల దాడులు, విశృంకలంగా మహిళల పై కాల్-మని పేరుతో జరిగిన లైంగిక దాడులను ప్రశ్నించిన మహిళా శాసనసభా సభ్యురాలిని సంవత్సరం పాటు సభనుండి వెలివేయటం లాంటి అప్రజాస్వామిక విధానాలను పవన్ ఏనాడు ప్రశ్నించలేదు.  2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పవన్ ప్రచారం చేసిన ఫలితంగా రాష్ట్రములో వైసిపి బహు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది.  అనంతరం పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా మారిన పవన్ ప్రశ్నించేందుకు తాను పాలిటిక్స్ లోకి వచ్చానని తెలిపారు.

అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు నలుగురికి ఏపీ కేబినెట్ లో తాజాగా చోటు కల్పించిన తీరుపై ఏ మాత్రం తన స్పందన వెలువరించలేదు. దీంతో పవన్ పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ - వైసీపీ నేత కందుల దుర్గేష్ జనసేన అధిపతి తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడంతో పాటు రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ ఎందుకు స్పందించడం లేదని కందుల దుర్గేష్ సూటిగా ప్రశ్నించారు.
“తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పడం తన నైజం”  అని చెప్పిన పవన్ భారత రాజ్యాంగాన్ని అపహా స్యం పాలు చేస్తున్నప్పటికీ ఎందుకు నోరు మెదపడం లేదని దుర్గేష్ నిలదీశారు. బాబు విధానాలకు పవన్ మద్దతు ఇస్తున్నారా ? అని అనుమానం వ్యక్తం చేశారు.


పార్టీలు మార్పించి పదవులు కట్టబెట్టిన చంద్రబాబు తీరును జనం కోసం ఉన్నానని చెప్పుకొంటూ ప్రశ్నించ కుండా ఉన్న పవన్ కళ్యాణ్ తీరును ప్రజలు గమనిస్తున్నారని,  ఆయన చెప్పారు. సరైన సమయంలో వారి పట్ల ప్రజలు సరైన రీతిలో వ్యవహరిస్తారని దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తెలుగు దేశాన్ని ముంచితే ఇప్పుడు పవన్ కల్యాణ్ తెలుగు దేశానికి సహకరించి ప్రజలు కోరుకున్న పార్టీని అధికారము లోకి రాకుండా తెలుగు ప్రజలకు ద్రోహమే చేస్తు న్నట్లు అర్ధమౌతుంది. గెలిచిన టిడిపి. పంటసిరులతో విలసిల్లే కృష్ణా గుంటూరు జిల్లాల్లో అమరావతి పేరిట భూములు ప్రజలనుండి లాక్కొని ప్రకృతినే పరిహాసం చేశారు. మంత్రి నారాయణ ఆద్వర్యములో భూముల కబ్జా నిరంతరంగా సాగిందని చంద్రబాబు తనయుడు అందులో లోకేష్ ఈ భూదందాలో చురుకైన పాత్ర పోషించాడని ఆరోజుల్లో వార్తలు వచ్చాయి. అంతే కాదు అగ్రిగోల్డ్ భూములను అన్యాయంగా తెలుగుదేశం భూదందా గాళ్ళు దోచేశారని ప్రజల్లో నిరసన పెల్లుబుకుతుంది. అందులో లోకేష్ పాత్ర అంతులేదంటు న్నారు. ఎలాగైనా రానున్న ఎన్నికలు తెలుగుదేశానికి అంధ్రప్రదేశ్ శాశ్వత సమాది కట్టేస్తాయనే అంటు న్నారు.  


ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ జనసేన కి తెలుగు దేశం పార్టీకి లోపూచీ అవగాహన ఉందేనేది వాస్తవమని పిస్తుంది. పవన్ ద్రోహం చేసిన బిజెపి టిడిపిల్లో బిజెపిని విమర్శించినంత ఘాటుగా టిడిపిని విమర్శించకపోవటం పూర్తిగా అనుమానాస్పదమే. మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: