అప్పుల ఊబిలో దక్కన్ క్రానికల్!

Ravi Chandra
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రముఖ మీడియా సంస్థ దక్కన్ క్రానికల్‌కు అప్పులకు తోడుగా నష్టాలు కూడా మొదలయ్యాయి. 2011 ఏప్రిల్ నుంచి 2012 సెప్టెంబర్ వరకు మొత్తం 18 నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే దక్కన్ క్రానికల్ 843 కోట్ల రూపాయల రాబడిపై 1,040 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది.బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులకు సంబంధించి కంపెనీపై పలువురు రుణదాతలు కేసులు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2010-11 వరకు లాభాల్లో ఉన్న దక్కన్ క్రానికల్ రెండేళ్లుగా పేరుకుపోయిన అప్పులు ఆపై నష్టాలతో సంక్షోభంలో పడింది. ఆర్థిక సంస్థల నుంచి సమీకరించిన రుణాలపై వడ్డీల చెల్లింపు కారణంగానే లాభాలు హరించుకుపోయినట్టు బిఎస్ఇకి అందజేసిన సమాచారంలో సంస్థ పేర్కొంది.ఫలితాల ప్రకటనలో జాప్యం, షేర్ హోల్డింగ్ డాటా సమర్పించకపోవడంతో దక్కన్ క్రానికల్ షేర్లలో ఈ నెల 23 నుంచి ట్రేడింగ్ సస్పెండ్ చేస్తున్నట్టుగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది వరకు ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: