ఇండియాలో కూలీలు, ట్రాక్టర్లను వాడితే.. విదేశాల్లో వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూడండి?
నేటి రోజుల్లో వ్యవసాయ వ్యయం ఎక్కువైనప్పటికీ కూడా అసాధారణ పద్ధతులను అగ్రికల్చర్ విభాగంలో ఉపయోగిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు ఎంతోమంది రైతులు. అయితే మన దేశంలో వ్యవసాయం చేసే పద్ధతులు ఎలా ఉంటాయి అనే విషయంపై దాదాపు అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఒకప్పుడు ప్రతి పనిని కూడా కూలీల ద్వారానే చేయించేవారు. కానీ ఇటీవల కాలంలో అటు కూలీలను ఉపయోగిస్తునే ఇంకోవైపు ట్రాక్టర్లు హార్వెస్టర్లు అంటూ ఎన్నో రకాల వాహనాల ద్వారా కూడా వ్యవసాయ పనులను పూర్తి చేస్తున్నారు. వ్యవసాయంలో ఇలాంటి వాహనాల మినహా మిగతా అధునాతన టెక్నాలజీతో కూడిన మిషిన్లు మాత్రం ఇండియాలో అందుబాటులోకి రాలేదు.
ఒకరకంగా ఇండియాలో ఇప్పటికీ కూడా సాంప్రదాయ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారు అని చెప్పొచ్చు. విదేశాల్లో మాత్రం వ్యవసాయం చేయడం విషయంలో సరికొత్త పనిముట్లను ఉపయోగిస్తూ ఉన్నారు. ఏకంగా డ్రోన్లు ఇతర టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వ్యవసాయ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు. కూలీల సహాయం లేకుండానే ఇక అన్ని పనులను కంప్లీట్ చేస్తున్నారు. ఇలా విదేశాలలో వ్యవసాయం కోసం ఎంత అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అన్నదానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. అక్కడి రైతులు వాటిలో చల్లడం స్ప్రే చేయడం కలుపు తీయడం పర్యవేక్షించేందుకు డ్రోన్లను వాడుతూ ఉన్నారు. అయితే ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే ఇలా డ్రోన్లను వాడే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.