మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా.. ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది?

praveen
మరికొన్ని రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా? ప్రపంచ దేశాల్లో మారణ హోమం  జరగబోతుందా? మనుషుల ప్రాణాలు ఏకంగా పిట్టల్లా రాలిపోబోతున్నాయా.. అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అందరూ అవును అనే సమాధానమే చెబుతున్నారు. ఎందుకంటే ఇక ప్రస్తుతం కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావిత ఘటనలు చూస్తూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి ఇంకా ఎంతో దూరం లేదు అన్న భావన అందరిలో కలుగుతుంది.

 ఇజ్రాయిల్ చిన్న దేశం అయినప్పటికీ తమ దేశ రక్షణ విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ దేశ రక్షణకు భంగం వాటిల్లుతుంది అంటే ఇక తమ ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే పట్టించుకోకుండా దాడులకు దిగడానికి సిద్ధమవుతూ ఉంటుంది. గత కొంతకాలం నుంచి ఇదే చేస్తుంది. ఏకంగా ఇజ్రాయిల్ లో మారణ హోమం సృష్టించడానికి ప్రయత్నించిన హమాస్, హెజ్పుల్ల లతో గత కొంతకాలం నుంచి పోరాటం చేస్తుంది ఇజ్రాయిల్. ఇక ఎప్పుడూ ఇరాన్ తో కూడా ఇజ్రాయిల్ యుద్ధానికి సిద్ధమవుతుంది అన్నది తెలుస్తుంది.

 దీంతో ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. హెజ్బొల్లా లీడర్లను ఇజ్రాయిల్ హతమార్చడంతో.. ఇరాన్ పగతో రగిలిపోతుంది. ఈ క్రమంలోనే ఇటీవలే వందల సంఖ్యలో మిసైల్స్ తో ఇజ్రాయిల్ పై దాడి చేసింది. ఇలా వందల మిస్సైల్స్ ఇజ్రాయిల్ పైకి దూసుకుపోతున్న వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. అయితే దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ ఇజ్రాయిల్ అధ్యక్షుడు నేతన్యహు హెచ్చరించాడు. అయితే ఇజ్రాయిల్ కి మద్దతు పలుకుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అటు ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయితే.. ఇరాన్ కు మద్దతుగా రష్యా కూడా వస్తుంది. దీంతో వరల్డ్ వార్ 3 జరగడం ఖాయం అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: