చనిపోయిన కుక్క కోసం అలా చేసి.. గిన్నిస్ రికార్డు కొట్టేసాడు?

frame చనిపోయిన కుక్క కోసం అలా చేసి.. గిన్నిస్ రికార్డు కొట్టేసాడు?

praveen
మనుషులకి కుక్కలకి మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఈ బంధం మరింతగా పెరిగిపోయింది. ఇక ఎంతోమంది తమకు నచ్చిన బ్రీడ్ కు సంబంధించిన కుక్కలను తెచ్చుకుని ఇంట్లో పెంచుకుంటున్నారు. ఏకంగా ఇంట్లో ఉన్న మనుషులను చూసుకున్నట్లుగానే కుక్కలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. కొంతమంది అయితే మనుషులనైనా పట్టించుకుంటారో లేదో కానీ కుక్కలను మాత్రం ఏకంగా తోడబుట్టిన అన్నదమ్ముల లాగా ప్రేమగా చూసుకోవడం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉపవాసం ఉన్న పర్వాలేదు కానీ కుక్కలకు మాత్రం మంచి ఆహారం పెట్టడం కూడా చూస్తూ ఉంటాం.

 అయితే అటు కుక్కలు కూడా యజమానుల పట్ల అంతే విశ్వాసాన్ని కనబరుస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నామ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది ఏకంగా పెంపుడు కుక్కలు ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే వాటి జ్ఞాపకార్థం ఇక ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఇలా చనిపోయిన కుక్క జ్ఞాపకార్థం చేసిన పని అందరిని అవాక్కాయ్యేలా చేసింది. అంతేకాదు అతనికి గిన్నిస్ బుక్ రికార్డును కూడా తెచ్చి పెట్టింది అని చెప్పాలి. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 అమెరికన్ సైకిల్స్ క్రిష్టి బెల్మేర్ తన పెంపుడు కుక్క జ్ఞాపకార్థం 4707 కిలోమీటర్లు ప్రయత్నించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్ లోని ఆన్సర్ డామ్ లో ప్రారంభించు జర్మనీ స్విజర్లాండ్ ఫ్రాన్స్ బెల్జియం గుండా సాగి తిరిగి స్టార్టింగ్ పాయింట్ లో ముగించారూ. ఈ పూర్తి రైడ్ జిపిఎస్ మ్యాప్ చూస్తే కుక్క ఆకారంలో ఉంటుంది. కుక్క పుట్టిన రోజు మే 1వ తేదీన ఇక ఈ రైడ్ ని మొదలుపెట్టినట్లు సదరు సైకిలిస్టు చెప్పుకొచ్చారు. అయితే ఇలా సైకిల్ ఫై 4707 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు ఆమె. అయితే పెంపుడు కుక్కపై ఆమెకు ఉన్న అమితమైన ప్రేమ గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: