తప్పిపోయిన 8 ఏళ్ల చిన్నారి.. ఏటీఎం సహాయంతో ఇంటికి.. ఎలాగంటే?

frame తప్పిపోయిన 8 ఏళ్ల చిన్నారి.. ఏటీఎం సహాయంతో ఇంటికి.. ఎలాగంటే?

praveen
సాధారణంగా జనరేషన్ నూ బట్టి ఆలోచన తీరు కూడా మారిపోతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అయితే నేటితరం పిల్లలను చూస్తూ ఉంటే ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది. 90s కిడ్స్ తో పోల్చి చూస్తే నేటి తరం పిల్లలు ఎంతో చురుకుగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా వినూత్నంగా ఆలోచించి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక నేటి రోజుల్లో కొంతమంది చిన్నారులు అయితే ఆడుకునే వయసులోనే రికార్డులు సృష్టిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని కొన్ని సార్లు ఈ తరం పిల్లల తెలివితేటలు చూసి ఆశ్చర్య పోవడం ప్రతి ఒక్కరి వంతు అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు చైనాకు చెందిన ఒక 8 ఏళ్ల చిన్నారి సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది.

 సాధారణంగా కుటుంబ సభ్యులతో ఎనిమిదేళ్ల చిన్నారి బయటికి వెళ్లి దురదృష్టవశాత్తు తప్పిపోతే.. చిన్నపిల్లలు ఎవరైనా ఏం చేస్తారు ఏడుస్తూ ఒక చోట కూర్చుంటూ ఉంటారు. లేదంటే ఇక తమ వాళ్ళ ఆచూకీ దొరుకుతుందేమో అని అటు ఇటు తిరగడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ చిన్నారి అందరిలా చేయలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇంటికి చేరింది. తాతతో కలిసి ఇంటికి వెళుతున్న చిన్నారి రోడ్డుపై తప్పిపోయింది. ఎంత వెతికిన తాత కనిపించలేదు. చుట్టుపక్కల కూడా సహాయం చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఇక ఇంటికి వెళ్లేందుకు దారి కూడా ఎనిమిదేళ్ల చిన్నారికి తెలియలేదు. ఇలాంటి సమయంలోనే ఈ చైనీస్ చిన్నారి తన తెలివితేటలను ఉపయోగించింది.

 చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని నిశితంగా గమనించి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు దగ్గరలో ఉన్న బ్యాంక్ ఎటిఎం లోకి వెళ్ళింది. అయితే చైనాలోని చాలా ఏటీఎం మెషిన్లలో అవసరమైతే బ్యాంక్ సిబ్బందికి ఫోన్ చేసే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆ బాలిక ఉపయోగించుకుంది. ఏటీఎం మిషన్ లోని  అత్యవసర కాలింగ్ బటన్ నొక్కడంతో వెంటనే బ్యాంకు సిబ్బందికి కనెక్ట్ అయింది. ఇక ఆ తర్వాత తన పరిస్థితిని బ్యాంక్ సిబ్బందికి తెలియజేసింది. వెంటనే బ్యాంకు సిబ్బంది చిన్నారి గురించి ఏటీఎం సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు. ఇలా అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారి వివరాలను తెలుసుకొని ఇంటికి చేరుకున్నారు. ఇలా చిన్నారి తప్పిపోయిన సమయంలో ఏడుస్తూ కూర్చోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరు అందరిని ఫిదా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: