ఆ దేశంలో.. భార్యలే భర్తలకు పాకెట్ మనీ ఇస్తారట తెలుసా?
అయితే భార్య ఉద్యోగం చేస్తూ సంపాదించినప్పటికీ ఎందుకో ఇక భర్త దగ్గర పాకెట్ మనీ అడిగి ఇక ఏదైనా కావలసిన వస్తువు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఇలా ఎన్నో ఏళ్లుగా భార్యకు భర్త పాకెట్ మనీ ఇవ్వడం అనే ఒక సాంప్రదాయం ఇండియాలో కొనసాగుతూ వస్తుంది అని చెప్పాలి. కానీ ఒక దేశంలో మాత్రం అలా కాదు ఏకంగా భర్తకు భార్య పాకెట్ మనీ ఇస్తూ ఉంటుందట. జపాన్లో ఇలాంటి నానుడి కొనసాగుతుందట. మనదేశంలో ఇలా భార్యకు భర్త పాకెట్ మనీ ఇస్తే జపాన్ లో మాత్రం ఈ సీన్ మొత్తం రివర్స్ లో ఉంటుందట. అక్కడ దాదాపు 74 శాతం మంది మహిళలు భర్తలకే పాకెట్ మనీ ఇస్తారట.
భర్తలకే భార్యలు పాకెట్ మనీ ఇస్తున్నారు అంటే అక్కడ భర్తలు తక్కువగా పనిచేసి భార్యలు ఎక్కువగా పనిచేస్తారేమో అని అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే పొరపాటు పడినట్టే ఎందుకంటే ఇక భర్తలు అందరిలాగానే పని చేస్తారు. అయితే నెల జీతం వచ్చిన వెంటనే తీసుకువెళ్లి భార్య చేతిలో పెడతారట. ఇంటి ఖర్చులు సేవింగ్స్ ఇతరత్రా ఖర్చులన్నీ పోను.. ఇక భార్య మిగిలినవి భర్త చేతికి ఇస్తారట. ఈ సాంప్రదాయాన్ని అక్కడ ఖోలికై అంటారు అయితే భర్త చేసే అదనపు ఖర్చులను తగ్గించేందుకు ఇలాంటి పద్ధతిని ఎన్నో కుటుంబాలు పాటిస్తూ ఉంటాయట.