యుద్ధం ఆపేస్తాం.. కానీ రెండు కండిషన్స్.. ఉక్రెయిన్ కు రష్యా ఆఫర్?

praveen
సాధారణంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కొన్నాళ్లపాటు జరిగి ఆ తర్వాత ముగుస్తుంది. కానీ రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దానికి మాత్రం ముగింపు లేదేమో అనే విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఈ యుద్ధం ఎక్కడి వరకు దారితీస్తుందో అని ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరికొన్ని దేశాలు కొన్ని రోజులు పాటు యుద్ధం జరిగి మళ్లీ ముగిసిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ రెండేళ్ల నుంచి ఎడతెరిపి లేకుండా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.

 ఈ యుద్ధంలో ఎంతోమంది సైనికులు నేలకొరిగిన.. ఇక ఎంతోమంది సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఇరుదేశాలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అయితే నాటోలో సభ్య దేశంగా ఉక్రెయిన్ చేరేందుకు సిద్ధమవుతుండగా అటు పొరుగు దేశమైన రష్యా మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఉక్రెయిన్ నాటోతో చేరాలనుకుంటే తాము యుద్ధానికి సిద్ధం అని చెప్పడమే కాదు చెప్పింది చేసి చూపించింది. ఈ క్రమంలోనే రష్యా చెప్పు చేతుల్లో ఉండడానికి ఇష్టపడని ఉక్రెయిన్ ఇక పెద్ద దేశమైన రష్యాకు ఇక యుద్ధంలో గట్టిగానే బదులు ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే వీరి యుద్ధంలో పలు దేశాలు కల్పించుకొని.. శాంతి చర్చలు సఫలం అయ్యేలా చేయాలని ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

 ఈ క్రమంలోనే ఇటీవలే రష్యా అధ్యక్షుడు యుద్ధం ఆపడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము యుద్ధం ఆపడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ తెలిపాడు. అయితే ఇలా చేయడానికి రెండు షరతులు పెట్టాడు పుతిన్. ఏకంగా నాటోలో సభ్య దేశంగా చేరాలనుకుంటున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటేనే కాల్పుల విరమణ చేపడుతాము అంటూ పుతిన్ వెల్లడించారు. అలా అయితే వెంటనే చర్చలు ప్రారంభిస్తాము అంటూ ఉక్రెయిన్ కు ఆఫర్ కూడా ఇచ్చారు. అలాగే ఉక్రెయిన్ స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రదేశాలను కూడా ఉక్రెయిన్ ఆర్మీ వదిలి వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే కాల్పుల విరమణ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఉక్రెయిన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: