బ్రిటన్ కు మండింది.. అందుకే రంగంలోకి దిగింది?

praveen
ఇస్లామిక్ దేశాలుగా కొనసాగుతున్న చాలా దేశాలలో ప్రస్తుతం ఉగ్రవాదుల రాజ్యమేలుతున్నారు అన్న విషయం తెలిసిందే. అక్కడ ప్రజాస్వామ్యంతో పనిలేకుండా పాలన సాగిస్తున్నారు. సాధారణ ప్రజలను సైతం బానిసలుగా చూస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ జనజీవన విధానం రోజు రోజుకు దారుణంగా మారిపోతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ఉగ్రవాదుల కనుసన్నల్లో పాలన నడుస్తున్న దేశాల్లో.. బ్రతకలేక ఎంతో మంది పొట్ట చేత పట్టుకుని ఇతర దేశాలకు వలస వెళ్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి దేశాలలో పాలస్తీనా కూడా ఒకటి అని చెప్పాలి. ఏకంగా ఉగ్రవాదుల ఆగడాలు ఎక్కువైపోవడంతో.. అక్కడి ప్రజలందరూ కూడా పొట్ట చేత పట్టుకుని బ్రిటన్ లాంటి దేశాలకు వలస వచ్చారు.

 అయితే ఇలా వలస వచ్చిన వారిని చేరదీసి అక్కున చేర్చుకుంది బ్రిటన్.  కానీ ఇప్పుడు బ్రిటన్ లో పాలస్తీనా నుంచి వచ్చిన ముస్లింల జనాభా భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇలా పొట్టకూటి కోసం వచ్చిన వారు ఇక ఇప్పుడు నీచమైన బుద్ధిని చాటుకుంటున్నారట. ఏకంగా బ్రిటన్కు వలస వచ్చి ఇక బ్రిటన్ ను శాసించేందుకు కూడా సిద్ధమవుతున్నారట. ఇటీవల కాలంలో హౌతీ, లేబనాన్ లాంటి ఉగ్రవాదులపై దాడి చేయడంతో పాటు ఇజ్రాయిల్ కి ఆయుధాల సరఫరా కూడా చేస్తూ వస్తుంది బ్రిటన్.

 అయితే పాలస్తీనా నుంచి బ్రిటన్కు వలస వచ్చిన వారికి ఇది నచ్చక చివరికి ప్రస్తుతం పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేస్తూ ఉన్నారు. ఏకంగా బ్రిటన్ శాసించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇన్నాళ్ళ వరకు కేవలం హెచ్చరికలతో మాత్రమే సరిపెట్టుకున్న బ్రిటన్.. ఇక ఇప్పుడు ఇలా నిరసనలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏకంగా భారీగా జరిమాణాలు కూడా విధిస్తామని బ్రిటన్ ఏకంగా హెచ్చరికలు జారీ చేసింది. ఇది కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: