న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఇక్కడ ఎంత వెరైటీగా చేసుకుంటారో తెలుసా?
డెన్మార్క్ : అక్కడ ప్రజలందరూ కూడా తలుపుల వద్ద పాత ప్లేట్లు గ్లాసులు విసిరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వల్ల చెడు ఆత్మలు అదృశ్యం అవుతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇంటి గుమ్మంలో ఎంత పగిలిన పాత్రలు పేరుకుని ఉంటే అంత మంచి జరుగుతుందని నమ్ముతారట.
అమెరికా : అమెరికాలోని జనాలందరూ కూడా ఎక్కువగా టీవీలు ఆన్లైన్లకు అతుక్కుపోతారు. ఎందుకంటే న్యూయార్క్ టైం స్క్వేర్ లో జరిగే బాల్ డ్రాప్ ఈవెంట్ అందుకు కారణం. ప్రత్యేకంగా రూపొందించిన బాల్ ను 31వ తేదీన వన్టైమ్స్ స్క్వేర్ పై నుంచి 11: 59 గంటలకు డ్రాప్ చేస్తారు. ఇక దీనిని ప్రతి ఒక్కరు కూడా టీవీలు ఆన్లైన్ లో వీక్షిస్తారట.
బ్రెజిల్ : కొత్త సంవత్సర సందర్భంగా అక్కడి ప్రజలందరూ ప్రత్యేకమైన లోదుస్తులు ధరిస్తారట. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతుంటారట.
ఫిన్లాండ్ : నూతన సంవత్సర సందర్భంగా కరిగిన టిన్ ను కరిగించి నీటిలో ముంచి లోహం గట్టిపడిన తర్వాత లోహానికి ఆకారంగా మార్చే ప్రక్రియను చేపడుతారట. ఈ లోహం గుండె లేదా ఉంగరం ఆకారాన్ని తీసుకుంటే అది వివాహం జరగడానికి చిహ్నం అని నమ్ముతారట. ఇక మెటల్ ఓడ రూపాన్ని తీసుకుంటే అది ప్రయాణంతో ముడిపడి ఉంటుందని భావిస్తారట.
స్పెయిన్ : స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజు పాటించే సాంప్రదాయం మరింత విచిత్రంగా ఉంటుంది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయం ఉంది. ఇక ఈ 12 ద్రాక్షలు 12 నెలలు అదృష్టంతో ముడిపడి ఉంటుందని.. అక్కడ ప్రజలను నమ్ముతారట. జనాలు అందరూ కూడా 12 ద్రాక్షలతో ఏకంగా సమూహంగా ఆరగించేందుకు ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంటారట.