పెళ్లికి రాకపోతే డబ్బులు కట్టండి.. కండిషన్ పెట్టిన వధువు?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఒంటరిగా సాగిపోతున్న జీవితానికి ఒక తోడు నీడను వెతుక్కుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక ఇలా పెళ్లితో తమ జీవితంలోకి వచ్చిన భాగస్వామితో కలకాలం ఎంతో సంతోషంగా ఉండాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే తమ పెళ్లిని పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆశపడుతూ ఉంటారు యువతీ యువకులు. ఈ క్రమంలోనే తెలిసి తెలియని బంధువులందరినీ కూడా పెళ్లికి ఆహ్వానించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఆహ్వానించడం వరకు వధూవరుల బాధ్యత. కానీ పెళ్ళికి రావాలా వద్దన్నది బంధువుల ఇష్టం..

 ఈ క్రమంలోనే ఇలా పెళ్లికి ఆహ్వానించినప్పటికీ కొంతమంది బంధువులు పెళ్లికి వెళ్లడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కొంతమంది ఎక్కువ పెళ్లిళ్లు ఉండడంతో ఇక కొన్ని పెళ్లిళ్లకు హాజరు అవడం లాంటివి చేయరు. మరి కొంతమంది వాళ్ళ పెళ్లికి ఏం వెళ్తాంలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఆహ్వానించిన బంధువులు ఎవరైనా పెళ్లికి రాలేదు అంటే పోనీలే ఏదో పని ఉండి ఉంటుంది. అందుకే రాలేదు అని అనుకుంటూ ఉంటారు నూతన వధూవరులు. కానీ ఇక్కడ మాత్రం వధువు అలా ఆలోచించలేదు. పెళ్లికి పిలిచిన బంధువులు రాకపోతే ఫీజు కట్టండి అంటూ సీరియస్ అయింది.

 ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఒక ఆస్ట్రేలియన్ వధువు నో షో ఫీజు పేరుతో పెళ్లికి రాలేమన్న పదిమంది నుంచి డబ్బులు వసూలు చేయాలని అనుకుంది. తాను పెళ్ళికి ఏకంగా 12,426 డాలర్లు ఖర్చు చేశానని.. ఒకవేళ తాను ఆహ్వానించిన పదిమంది పెళ్లికి రాకపోతే ఒక వెయ్యి 336 డాలర్ల నష్టం వస్తుందని తెలిపింది. ఇక ఆరు నెలల ముందే అతిథులు వస్తామని చెప్పారు అంటూ సదరు వధువు తెలిపింది. ఇక ఆమె పెళ్లి మరో వారంలో జరగబోతుంది అన్నది తెలుస్తుంది. ఇలా తన పెళ్లికి రాకపోతే ఏకంగా ఆ బంధువుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమైంది సదరు యువతి. ఈ విషయం తెలిసి ఈ కాన్సెప్ట్ ఏదో బాగానే ఉంది అని అనుకుంటున్నారు నెటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: