ఏంటీ.. డైనోసార్లు ఇంకా అంతరించిపోలేదా?
అయితే లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్లు భూమిపైన ఉండేవని.. కానీ ఇప్పుడు ఆ జాతి మొత్తం అంతరించిపోయింది అంటూ చెబుతూ ఉంటారు. ఇందుకు సంబంధించి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ శాస్త్రవేత్తలు చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇప్పటికీ కూడా డైనోసార్లు బతికే ఉన్నాయి అంటే నమ్ముతారా.. ఊరుకోండి బాసు అటు శాస్త్రవేత్తలు లక్షల సంవత్సరాల క్రితమే డైనోసార్లు అంతమయ్యయ్ అని చెబుతుంటే.. ఇప్పుడు ఉన్నాయ్ అంటారేంటి అంటారు ఎవరైనా. కానీ ఇప్పుడు కూడా డైనోసార్ల మనుగడకు సంబంధించిన విషయం ఒకటి హాట్ టాపిక్ గా మారిపోయింది.
భూమి మీద అంతరించిపోయిన డైనోసార్లు మరో గ్రహంలో మాత్రం ఇంకా జీవించి ఉండే అవకాశం ఉంది అంటూ ఒక అధ్యయనంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. భూమికి దూరంగా ఉన్న ఇతర గ్రహాలపై డైనోసార్లు ఉండే ఛాన్స్ ఉందని ఇక భూమిపై ఉన్న పరిశోధకులు టెక్నాలజీతో వాటిని గుర్తించొచ్చు అంటూ ఈ అధ్యయనం పేర్కొంది. అయితే డైనోసార్లు జీవించినప్పుడు భూమిపై అత్యధికంగా 30% ఆక్సిజన్ ఉండేదని.. ప్రస్తుతం ఆక్సిజన్ శాతం 21 శాతంగా ఉంది చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాగా ఈ అధ్యయానంకు సంబంధించిన అన్ని విషయాలు కూడా రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జర్నల్ లో ప్రచురితమైంది.