అమెరికాలో ఆడా మగా లేదు.. కొత్త రూల్స్?
అమెరికాలో బాయ్స్, గర్ల్స్ అని కూడా అనకూడదని టీచర్లకు చెబుతున్నారు. అలా అంటే కేసులు వేసే పరిస్థితి వచ్చింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ హ్యుమన్ సర్వీసెస్ ఇచ్చిన క్యాటగిరీల్లో షేషంట్ ఐడెంటీడీ లో సెక్స్ జెండర్ గురించి అడిగే సమయంలో నే సమస్య వచ్చింది. అయితే పుట్టినపుడు పురుషుడా.. స్త్రీనా లేక థర్డ్ జెండరా లేక చెప్పడం ఇష్టం లేదా ఆడ, మగ చెప్పడం ఇష్టం లేదా. ప్రస్తుతం ఎలా ఉన్నారు. అంటే ఇఫ్పుడు ఎలా ఉన్నారు. ఆడగా ఉన్నారా.. మగగా ఉన్నారా? థర్డ్ జెండర్ గా మారారా? అని ఫామ్ లో పేర్కొంటున్నారు.
స్కూళ్లలో కూడా గర్ల్ ని గర్ల్ గా కాకుండా బాయ్, బాయ్ గా కాకుండా న్యూట్రల్ గా పిలవాలని చెబుతున్నారు. జెండర్ కు సంబంధించి హర్మోన్, సైకాలజీ విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలుగా ప్రవర్తించడం.. అబ్బాయిలు అమ్మాయిలుగా ప్రవర్తించడం లాంటివి చేసే వారికి 18 సంవత్సరాలు తర్వాత జెండర్ మార్చే ఆపరేషన్ కు అవకాశం కల్పిస్తున్నారు.
కానీ చిన్నప్పుడు కోరితే వెంటనే చేసేయాలని అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఉంది. దీంతో 18 సంవత్సరాలు రాక ముందే జెండర్ ఆపరేషన్ చేస్తున్నారు. అంటే అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో వింత వింత చట్టాలు ఉండటం వల్ల అక్కడ కొన్ని కొన్ని వివాదాలు వస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై అక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.