రైతు క్రియేటివిటీ.. పొలంలో రోబో తోడేలు?

praveen
ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతుకు అడుగడుగున ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ప్రకృతి విపత్తులు తలెత్తి పంట నష్టం వాటిల్లితే ఇంకొన్నిసార్లు ఏకంగా అడవి జంతువుల కారణంగా పంట తీవ్ర నష్టం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా కష్టపడి పండిస్తున్న పంటను కాపాడుకునేందుకు రైతులు ఇటీవల కాలంలో వినూత్నమైన ఆలోచనలకు తెర లేపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఏకంగా పంటపొలాలలో సినీ సెలబ్రిటీలకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఉంటే.. ఇంకొంతమంది ఏకంగా జంతువులకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పంట నాశనం చేసేందుకు వచ్చే జంతువులను భయపెట్టడం లాంటివి చేస్తున్నారు.

 ఇలా రైతు ఎవరైనా వినూత్నమైన ఆలోచన చేశాడు అంటే చాలు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అతను ఎంతో కష్టపడి పంట వేశాడు. కానీ అడవికి దగ్గరగా ఉండడంతో ఇక ఎలుగుబంట్లు ఎక్కువగా పంట పొలంలోకి వచ్చి పంటను మొత్తం నాశనం చేస్తున్నాయ్. దీంతో ఆ రైతుకి నష్టాలు తప్పడం లేదు. అయితే ఈ ఎలుగుబంటిలో భార్య నుంచే పంటను కాపాడేందుకు.. ఆ రైతు వినూత్నమైన ఆలోచన చేశాడు.

 ఏకంగా పంట పొలంలో తోడేలు బొమ్మను ఏర్పాటు చేశాడు. జపాన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ పంట పొలాలపై విరుచుకుపడుతున్న ఎలుగుబండ్లను అడ్డుకునేందుకు వినూత్నంగా రోబో తోడేలను తీసుకువచ్చారు. ఎర్రటి కళ్ళతో విచిత్రమైన అరుపులు చేసే ఈ రోబో సోలార్ పవర్ సాయంతో పొలమంతా తిరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి సమయంలోనే ఎలుగుబంటి ఎక్కడైనా కనిపించింది అంటే చాలు దాని మీదికి ఈ రోబో తోడేలు దూసుకుపోతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఆలోచనతో ఎలుగుబంట్లు పంట పొలాల్లోకి రావడం లేదని.. ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అంటూ  రైతులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: