నిజంగా మృత్యుంజయుడే.. ఒకేరోజు ఆరుసార్లు గుండెపోటు.. అయినా?

praveen
తల్లి కడుపు లో నుంచి బయటికి వచ్చాక మరణం ఎప్పుడు సంభవిస్తుంది అంటే వృద్ధాప్యం లోనో లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో మరణం సంభవిస్తుందని అందరూ అంటూ ఉంటారు  కానీ ఇటీవల కాలం లో వెలుగు లోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత  విధి ఆడే నాటకం లో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలాంటివి మాత్రమే అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎలా మరణం సంభవిస్తుంది అన్నది ఊహకందని విధంగానే మారిపోతోంది.


 అప్పటివరకు ఎంతో సంతోషం గా గడిపిన వారు సైతం అనూహ్య రీతిలో కేవలం చూస్తూ చూస్తుండ  గానే నిమిషాల వ్యవధి లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురిచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటనల గురించి తెలిసిన తర్వాత అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణం ఎప్పుడు పోతుందో అని ప్రాణాలను అరచేతి లో పట్టుకొని దినదిన గండంగా బ్రతుకుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఒక్కసారి గుండె పోటు వస్తేనే ప్రాణాలు నిలవడం కష్టంగా మారింది. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రం ఒకే రోజు వ్యవధిలో ఆరుసార్లు గుండెపోటు వచ్చిన చివరికి అతని ప్రాణాలు నిలిచాయి.


 ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా అతన్ని మృత్యుంజయుడు కాబట్టే బ్రతికాడు అంటూ అనుకుంటున్నారు. లండన్ లో తీవ్ర అస్వస్థతకు గురైన భారత సంతతి విద్యార్థి అతుల్ రావ్ ప్రాణాలను వైద్యులు అద్భుత రీతిలో కాపాడారు. అతని ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడంతో గుండె నుంచి రక్త ప్రవాహానికి ఇబ్బంది ఏర్పడింది. దీంతో కాలేజీలోనే గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. రోజుల వ్యవధిలోనే అతనికి ఆరుసార్లు గుండెపోటు వచ్చింది.  ఊపిరితిత్తుల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తూ ఎంతో కష్టపడి రైతులు అతని ప్రాణాన్ని కాపాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: