సినిమాల్లో కూడా ఇలాంటి విన్యాసం చూసుండరు.. గిన్నిస్ రికార్డ్?

praveen
మనం సినిమాలలో ఎక్కువగా కారు విన్యాసాలు చూస్తూ ఉంటాం. ఏకంగా ఒకవైపు టైర్ పంచర్ అయిన సమయంలో  కేవలం మూడు టైర్ల పైనే కారును డ్రైవ్ చేయడం అప్పుడప్పుడు సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్లో జరుగుతూ ఉంటుంది. ఇక కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే కేవలం ఒకవైపు ఉన్న రెండు టైర్ల మీదే  కార్ డ్రైవింగ్ చేయడం చూస్తూ ఉంటాం. సినిమాల్లో ఇలాంటివి చూస్తున్నప్పుడు బాగానే అనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో  ఇలా కేవలం రెండు టైర్ల మీద డ్రైవింగ్ చేయడం అనేది అసాధ్యం అని చెప్పాలి. ఇలాంటి విన్యాసం ఎవరైనా చేస్తారా అని అడిగితే.. ఊరుకోండి బాసూ.. ప్రాణాల మీద ఆశలు లేని వాళ్లే ఇలాంటి విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తారు అని అందరు సమాధానం చెబుతారు.



 అయితే ఇక్కడ ఒక వ్యక్తి అచ్చం సినిమాల్లో కనిపించే లాగానే ఒక అద్భుతమైన విన్యాసం చేసి.. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. సాధారణంగానే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎవరు ప్రయత్నించనివి ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించి.. ఇక వరల్డ్ రికార్డ్ సృష్టిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అయితే అన్ని రకాల వయసుల వారు ఇలా వరులు రికార్డులు సాధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక స్టంట్ డ్రైవర్ రెండు చక్రాలపై ట్రక్ ని నడిపి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాడు.


 ఇటలీకి చెందిన స్టంట్ డ్రైవర్ ట్రక్ క్యాబ్ ను రెండు చక్రాలపై 12 అడుగుల ఐదు అంగుళాల గ్యాప్ ద్వారా నడిపి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. మార్కో డేవిడ్ జియోని అనే 43 ఏళ్ళ వ్యక్తి ట్రక్ను ఉపయోగించి ఎడమవైపు చక్రాలు పైకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సైడ్ బారియర్ తాకకుండా ఇరుకైన గ్యాప్ లో ట్రక్ ను తీసుకొచ్చాడు. అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిబంధన ప్రకారం జియోని కనీసం 32.8 అడుగులు వాహనం బోల్తా పడకుండా నడపాలి. జియోని తన మూడో ప్రయత్నంలో ఈ ఘనతను సాధించాడు. ట్రక్కు క్యాబిన్ చాలా ఎక్కువగా కదులుతుంది.  ట్రక్ ని మానేజ్ చేయడం కష్టంగా మారింది. అందుకే మరింత ఏకాగ్రత పెట్టి మూడో ప్రయత్నంలో విజయం సాధించగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు మార్కో డేవిడ్. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: