ప్రపంచ చరిత్రలో.. పేరు మార్చుకున్న దేశాల లిస్ట్ ఇదే?

praveen
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియాను ఎంతో మంది రెండు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఇండియా అని పిలిస్తే ఇంకొంత మంది భారత్ అని పిలుస్తూ ఉంటారు. అయితే కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అనూహ్యమైన  మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఇండియాకు ఒకే ఒక్క పేరు ఉండాలి అని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇండియా పేరును తొలగించి ఇండియాకు భారత్ అనే ఒకే ఒక పేరును కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.


 ఈ క్రమంలోనే ఇలా పేరు మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇలా పేరు మార్చడం అనేది భారతీయులకు కొత్త అంశంగా అనిపిస్తుంది. కానీ అటు అంతర్జాతీయంగా చూసుకుంటే మాత్రం ఒక దేశం పేరు మారడం ఇదేమి కొత్తకాదు. చరిత్రలో చాలా సార్లు చాలా దేశాల పేర్లు మాయాయ్. స్వాతంత్రం రాజకీయం సాంస్కృతిక సామాజిక అంశాలతో ప్రభావంతో ఈ మార్పులు చేర్పులు జరిగినట్లు చరిత్ర చెబుతుంది. దీంతో ఇప్పటివరకు ఇలా ఏ దేశాలు పేర్లు మార్చుకున్నాయ్ అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.


 ఆ వివరాలు చూసుకుంటే.. 2019లో రిపబ్లిక్ ఆఫ్ మాసిదోనియా పేరును నార్త్ మాసిడోనియాగా మార్చారు.

 అనేక రాజకీయ తిరుగుబాట్లు వివాదాల తర్వాత జైన్ దేశం పేరును ద డెమోక్రటిక్ పబ్లిక్ ఆఫ్ ది కాంగోగా మార్చుతూ 1997లో నిర్ణయం తీసుకున్నారు.  ఇలా పేరు మార్చిన తర్వాత మూడు దశాబ్దలకు పైగా సాగిన నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన తిరిగి వచ్చింది.

 1993 లో చేకో స్లోవాకియాగా ఉన్న పేరును చెక్ రిపబ్లిక్ ఆఫ్ స్లో వేకియాగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.

 1989లో  బర్మా దేశం పేరును మయన్మార్ గా మార్చేశారు. 1972లో సిలోన్ ద్వీపం పేరును శ్రీలంకగా మార్చారు. శ్రీలంక అంటే సింహాలి భాషలో ప్రకాశవంతమైన భూమి అని అర్థం వస్తుంది. 1971లో యుద్ధంలో గెలిచిన తర్వాత పాకిస్తాన్ నుంచి వేరుపడిన ఈస్ట్ పాకిస్తాన్ తమ దేశం పేరును బంగ్లాదేశ్ గా మార్చుకుంది. కాగా 1939లో సీయామ్ పేరును థాయిలాండ్ గా మార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: