మహిళలను ప్రకృతికి దూరం చేస్తూ.. తాలిబన్లు మరో ఆంక్ష?

praveen
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అని చెప్పాలి. ఇస్లాం ధర్మం పేరుతో కొత్త నిబంధనలను తెరమీదకి తీసుకువచ్చిన అక్కడ ప్రభుత్వ అధికారులు.. చివరికి మహిళలకు కాస్తయినా స్వేచ్ఛ లేకుండా చేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకరకంగా  మహిళలందరికీ కూడా బ్రతికుండగానే నరకం చూపిస్తూ ఉన్నారు. ఇక మహిళలు అనేవారు మనుషులు కాదు కేవలం ఆట బొమ్మలు మాత్రమే అని.. ఒక రేంజ్ లో ఇక దారుణమైన ఆంక్షలు విధిస్తూ ఉండడం గమనార్హం. ఇలా చదువుకుంటున్న వారు వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని సైతం వంటింటి కుందేలుగా మార్చేశారు తాలిబన్లు.


 అయితే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన  తర్వాత మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పినవారు. ఇప్పుడు మాత్రం తమ బుద్ధిని మార్చుకోకుండా మరోసారి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇప్పటికే ఉద్యోగాలకు దూరం చేశారు. కనీసం ఆఫ్ఘనిస్తాన్ లో బ్యూటీ పార్లర్ లు కూడా లేకుండా చేశారు. ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం అనే విధంగా మహిళల జీవితం మారిపోయేలా ఆంక్షలు విధిస్తూ  ఉన్నారు తాలిబన్లు. అయితే ఇవేవీ చాలవు ఉన్నట్లు తాలిబన్లు మరోసారి మహిళలపై మరో ఆంక్షలు విధించారు.



 చివరికి ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించే స్వేచ్ఛ లేకుండా చేశారు. ఏకంగా ఆ దేశంలోని ప్రధాన జాతీయ పార్కుల్లో ఒకటైన బడ్ ఈ అమీర్ పార్కులోనికి మహిళలకు ప్రవేశం లేదని ఆంక్ష విధించారు. దీని గురించి ఆ దేశ ధర్మం మరియు దుర్గణం శాఖ మంత్రి మహమ్మద్ ఖలీద్ అనాఫి మాట్లాడుతూ మహిళల సైట్ సీయింగ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మహిళలను పార్కులోకి వెళ్లకుండా మత పెద్దలు సెక్యూరిటీ సంస్థలు అడ్డుకోవాలని చెప్పారు. అయితే కొంతమంది మహిళలకు హిజాబ్ ధరించడం లేదని.. ఇక హిజాబ్ ధరించిన సరిగా వేసుకోవడం లేదని.. ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించాడు. అయితే మహిళలను ఇలా ప్రకృతికి కూడా దూరం చేయడం దారుణం అంటూ ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: