కిమ్ వింత రూల్.. ఆ పని చేసిన జైలు శిక్ష?

praveen
ఉత్తర కొరియాలో తీసుకొచ్చే నిబంధనలు ఆ దేశ ప్రజల హక్కులను ఎల్లప్పుడూ కాలరాసేలా ఉంటాయి. తాజాగా ఈ దేశం మరో కఠినమైన రూల్ తీసుకొచ్చింది. తన పౌరులపై ప్రచార పబ్లికేషన్లను చెత్త పేపర్‌గా ఉపయోగించకుండా ఒక నిబంధనను ప్రవేశపెట్టింది. దీని గురించి ఆ దేశంలోని నివాసితులు రేడియో ఫ్రీ ఆసియా (RFA)కి తెలిపారు. ఉత్తర కొరియా ప్రభుత్వం అధికారిక మౌత్‌పీస్ అయిన రోడాంగ్ సిన్‌మున్ వార్తాపత్రికలో ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ గురించి మాత్రమే రాస్తారు. అందులో అతని ఫోటోలు బాగా ఉంటాయి. అయితే చదివేసిన తర్వాత ఈ పేపర్లను మార్కెట్‌లో రకరకాల ఐటమ్స్ చుట్టడానికి, వాల్‌పేపర్ గోడలకు అతికించడానికి, సిగరెట్లను చుట్టడానికి కూడా ఉపయోగిస్తున్నారు.

అయితే ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ చిత్రాల గల పేపర్లను ఇలా వాడటం అమర్యాదకరమని ప్రభుత్వం చెబుతోంది. అందుకు బదులుగా రోడాంగ్ సిన్మున్ పాత సంచికలను రీసైకిల్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇటీవలి వారాల్లో ప్రచార పబ్లికేషన్లను చిత్తు కాగితాలుగా ఉపయోగించినందుకు కొందరు పౌరులను అరెస్టు చేసినట్లు అనేక నివేదికలు వచ్చాయి. ఒక సందర్భంలో ఇద్దరు మహిళలు రోడాంగ్ సిన్మున్ పాత కాపీలను రైస్ కేక్ సెల్లర్, పొగాకు విక్రేతకు విక్రయిస్తూ పట్టుబడ్డారు. వారిని నిర్బంధ కేంద్రానికి తరలించి జరిమానా విధించారు.

పనికిరాని న్యూస్ పేపర్ చిత్తు కాగితంగా వాడితేనే ఇక్కడ ఇంతటి కఠిన శిక్షలు విధిస్తున్నారు. దీని గురించి తెలిసి మిగతా ప్రపంచం నివ్వరపోతోంది. స్క్రాప్ పేపర్‌గా ప్రచార ప్రచురణలను ఉపయోగించడం పై విధించిన ఈ బ్యాన్ ఉత్తర కొరియాలో కఠినమైన జీవిత వాస్తవాన్ని గుర్తు చేస్తుంది. చిన్నపాటి చర్యలకు కూడా తమ పౌరులను శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండటం అందర్నీ షాక్‌కి చేస్తుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎప్పుడైనా అరెస్టు కావచ్చననే భయంతో ఉత్తర కొరియా ప్రజలు జీవిస్తున్నారు.

రోడాంగ్ సిన్మున్ వార్తాపత్రిక అధిక నాణ్యత గల కాగితంపై ముద్రించడం జరుగుతుంది. క్వాలిటీ బాగుంటుంది కాబట్టి దీనిని అన్నిటికీ ప్రజలు వినియోగిస్తుంటారు. గతంలో కూడా ఇలాంటి పేపర్ చిత్తు పేపర్లలా వాడితే మూడేళ్లు జైలలో వేస్తామని ఆ దేశాధినేత వింత రూల్ తీసుకొచ్చి ప్రజలకు షాక్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kim

సంబంధిత వార్తలు: