ఏంటి.. టీ పాట్ ధర.. రూ..24 కోట్లా?
అయితే ఇలా కొంతమంది అయితే బయటికి వెళ్లినప్పుడు కూడా తమ వెంట చాయ్ తీసుకువెళ్లి ఇక ఎక్కడో బయట కాసేపు చాయ్ తాగుతూ కుటుంబంతో గడపాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇలా చాయ్ తీసుకెళ్లాలి అనుకునేవారు చాయ్ పాట్ కొనుగోలు చేయడంచేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితేఇలా ఎంతోమంది వినియోగించే టీ పాట్ ధర ఎంత ఉంటుంది అంటే మహా అయితే ఒక వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఏకంగా టీ పాట్ ధర 24 కోట్లు ఉంటుంది అంటే ఎవరైనా నమ్ముతారా. ఊరుకోండి గురు.. టీ పాట్ ఏంటి 24 కోట్లు ఏంటి అంత ధర ఉంటే ఎవరైనా కొంటారా అని అంటారు ఎవరైనా.
కానీ ఏకంగా 24 కోట్ల విలువైన టీ పాట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. ది ఇగో ఈస్ట్ అని పిలుచుకునే టీపాట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదట. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. బ్రిటన్ కు చెందిన ఫౌండేషన్ లండన్ లోని న్యూబిటీస్ సంయుక్తంగా ఈ టీ పాట్ ను తయారు చేయించారు. 1658 వజ్రాలు 386 ప్రామాణికమైన థాయ్, బర్మీస్ కెంపులు ఉపయోగించారట.