పాత సామాన్లు పడేస్తుంటే దొరికిన ట్రంకు పెట్టి.. ఏంటా అని తెరిచి చూస్తే?

praveen
కాలం కలిసి రావాలి కానీ ఏదో ఒక విధంగా అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏకంగా కూటికి కూడా గతి లేనివారు కోటీశ్వరులుగా మారిపోతారు అని అంటూ ఉంటారు. అయితే ఇలాంటివి చెప్పినప్పుడు ఇది నిజం అని నమ్మడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలను చూసిన తర్వాత ఇది ముమ్మాటికి నిజం అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎంతో మంది రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిపోతూ ఉంటారు  ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాగే అదృష్టం వరించింది.


 అదృష్టం వరించింది అనగానే ఏ లాటరీనో తగిలింది అనుకునేరు. అలా అనుకున్నారు అంటే పొరపడినట్లే మరో రూపంలో అతనికి అదృష్టం వరించింది. సాధారణంగా పాత ఇళ్లలో గుప్త నిధులు అప్పుడప్పుడు బయటపడటం చూస్తూ ఉంటాం  ఇక్కడ ఒక పాత సామాన్లను సర్దుతూ ఉండగా.  ఒక పెద్ద పెట్టె దొరికింది  అది ఓపెన్ చేశాడు చివరికి కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన చీలిలో వెలుగులోకి వచ్చింది. ఎక్సిక్వల్ హినోజోస పాత సామాన్లు సరి చేస్తుండగా తన తండ్రికి చెందిన పాత ట్రంకు పెట్టి దొరికింది. బాక్స్ ఖాతా గురించి ఎవరికి తెలియదు. 1960- 70లో ఎక్సిక్వల్ తండ్రి ఒక ఇంటిని కొనుగోలు చేయాలని డబ్బును జమ చేసాడట. 1.4  లక్షలు డిపాజిట్ చేసాడు.


 60 సంవత్సరాల క్రితం దీని విలువ మరింత ఎక్కువ ఉండేది. అయితే ఎక్సిక్వల్ తండ్రి చనిపోయి దశాబ్దానికి పైగా గడిచిపోయింది. దీంతో అప్పటి నుంచి బ్యాంకు పాస్బుక్ పాత పేటలో చెత్తలో అలాగే ఉండిపోయింది. ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. పాత వస్తువులను తొలగిస్తున్న సమయంలో ఈ బ్యాంక్ పెట్టె చూశాడు సదర్ వ్యక్తి. పెట్టెలో ఏముంది అని చూస్తే బ్యాంకు పాస్బుక్ దొరికింది  కానీ ఆ బ్యాంకు ఖాతా మూతపడటంతో ఒకసారిగా అతని ఆనందం ఆవిరైంది. కానీ అదే పాస్ బుక్ పై ఒకచోట స్టేట్ గ్యారెంటీడ్ అని ముద్ర పడింది. న ఆ ఖాతాలో డబ్బులు ఎంత జమ చేశారో.. చీలి ప్రభుత్వం దాన్ని తిరిగి ఇస్తుందని హామీ ఇచ్చింది. దాంతో అతనిలో కొత్త ఆశలు చిగురించాయి. అతను దావా వేస్తే ప్రభుత్వ మాత్రం తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది.  దీంతో కోర్టులో అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 1.2 మిలియన్ డాలర్లు అతడు పొందడు అంటే భారత కరెన్సీలో 10 కోట్లు అతనికి దక్కాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: