ప్రపంచంలో చిన్న దేశం.. 27 మంది జనాభా.. ప్రత్యేక సైన్యం కూడా?

praveen
సాధారణంగా ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా సరే జనాభా కోట్లల్లో ఉంటుంది. ఒకవేళ కోట్లలో లేకపోయినా కనీసం లక్షల్లో అయినా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో అన్నిటికంటే చిన్న దేశం ఏది అని అడిగితే వాటికన్ కంట్రీ అని చెబుతూ ఉంటారు అందరూ.  అందరికీ తెలిసింది కూడా ఇదే. కానీ వాటికన్ కంట్రీ కంటే చిన్న దేశం ఉంది అని చాలామందికి తెలియదు. పేరుకు చిన్న దేశం మాత్రమే కాదు అక్కడ జనాభా గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు. కనీసం ఒక గ్రామంలో ఉన్న జనాభా కూడా ఆ దేశంలో ఉండదు.


 ఇంతకీ ఇలా వాటికన్ కంట్రీ కంటే చిన్న గా ఉన్న దేశం పేరు ఏంటో తెలుసా సిల్యాండ్. సీలాండ్ అంటే భూమి చుట్టూ సముద్రం ఉండడం. వాటికన్ కంట్రీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది కాబట్టి ఈ దేశం గురించి అందరికీ తెలుసు. కానీ సీల్యాండ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందలేదు. దీంతో చాలామందికి ఇది ఒక దేశం ఉంది అన్న విషయం కూడా తెలియదు. ఇక ఈ దేశం ఏకంగా ఇంగ్లాండ్ కు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంతకీ ఈ చిన్న దేశంలో ఉండే జనాభా ఎంతో తెలుసా.. 27 మంది మాత్రమే. వినడానికే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ ఇది నిజమే. కేవలం ఈ దేశంలో 27 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశం 550 చదరపు  మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.


 ఇదంతా వింటుంటే ఈ దేశం కనీసం ఇండియాలో ఉన్న ఒక చిన్న గ్రామం కంటే ఎంతో చిన్నది అన్నది అర్థమవుతుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చిన్న దేశానికి సొంత సైన్యం.. సొంత జండా.. సొంత కరెన్సీ కూడా ఉంది అని చెప్పాలి. అంతేకాదు ఒక రాణి ఈ దేశాన్ని పాలిస్తూ ఉంది. అయితే ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ దాడుల నుంచి తమను తమ రక్షించోడుకోవడం కోసం ఇంగ్లాండు ఈ దేశాన్ని ఉపయోగించుకుంది. ప్రస్తుతం ఈ దేశం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. రెండు ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారు సీలాండ్ నగరాన్ని నిర్మించారట. ఇక ఈ దేశాన్ని సైన్యం కోసం, నావిక కోట కోసం ఉపయోగించారట. అయితే గత 54 సంవత్సరాలుగా మాత్రం ఇంగ్లాండ్కు ఈ దేశం వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nru

సంబంధిత వార్తలు: