ఓరినాయనో.. ఆవు ఖరీదు రూ.35 కోట్లు?
అయితే ఇప్పుడు వెలుగు లోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవులోకి చెందినదే. ఇటీవల కాలంలో ఎంతోమంది ఆవులను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక ఆవులను భారీ ధర పెట్టి కొనుగోలు చేసి ఇక ఏకంగా ఇంట్లో మనిషి లాగా చూసుకోవడం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే సాధారణంగా ఆవును కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు మహా అయితే లక్ష రూపాయల వరకు ఆ ఆవు కోసం ఖర్చు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ఆవు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా.
కోట్ల రూపాయలు పెట్టి ఆవులు కొనుగోలు చేయడం ఏంటి ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఏకంగా ఒక ఆవు ధర 35 కోట్ల రూపాయలు పలికింది. ఏపీ నెల్లూరు జాతి ఆవులను తీసుకెళ్లి బ్రెజిల్ దేశం లక్షణాలను మరింత అభివృద్ధి చేసింది. తాజాగా ఈ జాతికి చెందిన నాలుగున్నరేళ్ళ ఆవును వేలం వేశారు. దీనికి మూడో వంతు యాజమాన్య హక్కును ఓ వ్యక్తి 1.44 మిలియన్ డాలర్లు అంటే 17.78 కోట్లకు సొంతం చేసుకున్నారు. దీని ప్రకారం ఆవు మొత్తం విలువ 35.34 కోట్లు. ఇక ఈ ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది అని చెప్పాలి.