కరోనా చైనా సృష్టే.. 4 రకాల వైరస్ లు తయారు చేశారు?

praveen
కరోనా వైరస్.. ఈ పేరు వింటే చాలు ఇక ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు అన్ని దేశాల్లో కూడా ఇక మారణహోమాన్ని  సృష్టించింది ఈ వైరస్. ఈ ప్రాణాంతకమైన వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఎప్పుడు బిజీ బిజీగా ఉండే మనిషి కేవలం ఇంటిపట్టునే ఉంటూ గడప దాటి కాలు బయట పెట్టే ధైర్యం చేయలేదు అని చెప్పాలి. ఇక లక్షల మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ఇక అందరిలో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి అని చెప్పాలి.

 ముందుగా చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ క్రమక్రమంగా.. ప్రపంచం మొత్తం పాకిపోయింది. దీంతో చైనా ప్రపంచంలోనే అగ్ర దేశంగా ఎదిగేందుకు ఇక కరోనా వైరస్ రూపంలో ఒక బయోవేపెన్ ను ప్రయోగించింది అంటూ ప్రపంచ దేశాలు ఆరోపించాయి. కరోనా వైరస్ ఎంతో ప్రమాదకరమైనది అన్న విషయం ముందే చైనాకు తెలుసని.. నిజాలను దాచి ప్రపంచ వినాశనానికి చైనా ప్రయత్నించింది అంటూ ఇక ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఆరోపణలు చేశారు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని దేశాలు చైనా విషయంలో కాస్త కఠిన ఆంక్షలు విధించడం కూడా జరిగింది అని చెప్పాలి.

 అయితే చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ గురించి ఇక ఆ దేశ రీసెర్చర్ చావొ షావో  ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైరస్ ను చైనా సృష్టించిన బయో వెపన్ అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. చైనాలోని ఊహన్ ల్యాబ్ లో  ఏకంగా నాలుగు రకాల కరోనా వైరస్లను తయారు చేశారు. అయితే ఏ వైరస్ ఎక్కువ మందిపై ప్రభావం చూపుతుంది అనే విషయంపై కూడా రీసెర్చ్ చేశారు. ఇక ఇందులో ఇతర జీవులను వినియోగించారు. ఒక ఆ తర్వాత 2019లో మిలటరీ వరల్డ్ గేమ్స్ సందర్భంగా క్రీడాకారుల గదుల్లోకి శాస్త్రవేత్తలను పంపించి ఇక వైరస్ వ్యాప్తి చెందేలా చేసారు అంటూ చైనా శాస్త్రవేత్త చావొ షావో సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: