వరల్డ్ రికార్డ్ సృష్టించాలనుకున్నాడు.. కానీ ప్రాణం పోయింది?

praveen
సాధారణంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవాలని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అయితే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ రికార్డు మన సొంతం అవుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఒకే విషయంపై ఏళ్ల తరబడి కఠినమైన సాధన చేసి ఇక గిన్నిస్ బుక్ లో తమ పేరును ఎక్కించుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇటీవల కాలంలో కొంతమంది చిన్న చిన్న పనులనే ఎవరికి సాధ్యం కాని విధంగా వెరైటీగా చేస్తూ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంటున్నారు. దీంతో ఇలాంటి పనులు చేసి కూడా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవచ్చా అనే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక యువకుడు కూడా ఇలాగే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో తన పేరును చూసుకోవాలి అనుకున్నాడు. దీనికోసం ఎవరు చేయని విధంగా కొత్తగా ట్రై చేయాలని అనుకున్నాడు. కానీ చివరికి అలా ప్రయత్నించాలి అనుకున్న అతని ఆలోచన ప్రాణాలు తీసేసింది.

 సముద్ర గర్భంలో రూబిక్స్ క్యూబ్ ని వేగంగా అమర్చి ప్రపంచ రికార్డు సృష్టించాలని భావించాడు. ఈ క్రమంలోనే ఇటీవల టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన మినీ జలంథర్గామిలో వెళ్ళాడు. చివరికి ప్రాణాలు పోయాయి. అతను ఎవరో కాదు పాకిస్తాన్ బిలియనీర్ షహజాద్ కుమారుడు సులేమాన్. రూబిక్  క్యూబ్ వేగంగా అమరచడంలో టాలెంట్ ఉన్న సులేమాన్ సముద్ర గర్భంలో ఇక వేగంగా రూబిక్ క్యూబ్ అమర్చి ప్రపంచ రికార్డు సృష్టించాలని అనుకున్నాడు. ఇక ప్రపంచ రికార్డుకు దరఖాస్తు చేసుకొని మరి కెమెరా కూడా తీసుకువెళ్లాడు. కానీ దురదృష్ట వశాత్తు  సులేమాన్ జలంథర్గామి ప్రమాదంలో చనిపోయాడు. ఈ విషయాన్ని ఇటీవల  సులేమాన్ తల్లి వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: