వింత ఆచారం.. పెళ్లి కావాలంటే.. ముందు అలా చేయాలట?

praveen
వివాహ వ్యవస్థ అనేది ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి దేశంలో వివాహం విషయంలో వినూత్నమైన సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. ఇక మన దేశంలో అయితే ఎన్నో మతాలు ఉన్నాయి. కాబట్టి వారి మతాలకు సంబంధించిన సంప్రదాయాలకు అనుగుణంగానే వివాహం జరిపించడం చేస్తూ ఉంటాం. అయితే ఇక కొన్ని దేశాల్లో వివాహాల విషయంలో కొనసాగే ఆచారాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవాక్కయ్యల చేస్తూ ఉంటాయని చెప్పాలి.

 వామ్మో ఇదెక్కడి ఆచారం రా బాబు అని ప్రతి ఒక్కరికి అనిపించే విధంగా కొన్ని దేశాల్లో వివాహం విషయంలో సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఇలాంటి వింతైన ఆచార గురించి. సాధారణంగా  నచ్చిన యువతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం గురించి విన్నాము.  కానీ ఆ దేశంలో ఇలా చేస్తే కుదరదు. ఏకంగా పక్క వాడి భార్యపై కన్నేసి కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలి. వినడానికే విచిత్రంగా ఉంది కదా.. కానీ ఇది వారికి తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.. ఆఫ్రికా దేశంలో ఈ సాంప్రదాయం కొనసాగుతుందట.

 వోడాబ్బో తెగలో ఈ వింత ఆచారం కొనసాగుతుంది అన్నది తెలుస్తుంది. తెగలోని ప్రజలందరూ కూడా వివాహం చేసుకోవాలి అనుకుంటే వారు ముందుగా ఇతరుల భార్యలను కిడ్నాప్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇలా కిడ్నాప్ చేసిన మహిళనే వివాహం చేసుకోవాలి. అయితే ఇలా ఇతరుల భార్యను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ గ్రామంలోని పెద్దలు వారికి శిక్షలు వేయారట. మొదటి పెళ్లి మాత్రం తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం జరిగితే రెండో పెళ్లి మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతుందట. ప్రతి ఏడాది ఈ తెగ గిరిజనులు గేరేవో  ఉత్సవాలు జరుపుకుంటారు. పండుగలో అబ్బాయిలు ముఖం నిండా రంగులు పూసుకుని  ప్రదర్శన చేస్తూ ఇతరుల భార్యలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారట. అయితే ఇలా మహిళలను ఆకర్షించే సమయంలో వారి భర్తలకు విషయం తెలియకూడదట. ఏదేమైనా ఈ ఆచారం మరీ వింతగా అనిపిస్తుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: