మొబైల్ వాడుతూ ట్రైన్ నడిపిన లోకో పైలట్.. చివరికి?
సాధారణంగా బైక్ లేదా కార్ నడిపేటప్పుడే మొబైల్ ను వినియోగించడం అనేది నిషేధం. కానీ కొంతమంది ఇలా నిర్లక్ష్యంగా బైక్ లేదా కారు నడిపేటప్పుడు మొబైల్ వాడుతూ చివరికి రోడ్డు ప్రమాదం బారిన పడుతూ ఉన్నారు. అయితే బైక్ కార్ నడిపే వారే మొబైల్ వాడొద్దు అనే నిబంధన ఉంటే.. ఇక ట్రైన్ నడిపే లోకో పైలట్ మొబైల్ వాడటం పై ఎంత కఠినమైన నిబంధనలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఇక్కడ ఒక మహిళ లోకో పైలట్ మాత్రం ఏకంగా మొబైల్ వాడుతూ చివరికి రైలు ప్రమాదానికి కారణమైంది.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. రష్యాలో ఇక ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2009 అక్టోబర్లో ఈ ఘటన జరిగినప్పటికీ ఇటీవల సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ గా మారిపోయింది. రైలు నడుపుతున్న మహిళ లోకో ఫోన్లో వీడియో చూస్తూ కాలక్షేపం చేస్తుంది. అదే ట్రాక్ పై మరో రైలు ఆగి ఉంది. మహిళ ఫోన్లో బిజీగా ఉండడంతో ముందు ఉన్న రైలు గుర్తించలేదు. తీరా దగ్గరికి వచ్చాక గమనించి బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా అప్పటికే రైలు దగ్గరికి వెళ్లడంతో చివరికి రెండు రైళ్లు ఢీకొట్టుకున్న ఇక ఈ ఘటనలో రైల్లో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.