బుగ్గల అందం కోసం ఇంజక్షన్.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
ఇటీవల కాలంలో వైద్య రంగంలో వినూత్నమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మనిషి ఏం చేయడానికైనా అవకాశం ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ సహాయంతో ఇటీవల కాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అటు ప్లాస్టిక్ సర్జరీల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తమ శరీరంలో నచ్చని భాగాలను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తమకు నచ్చిన విధంగా మార్చుకోగలుగుతున్నారు.

 అయితే కొంతమంది కేవలం ముఖానికి మాత్రమే ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం ఏకంగా బాడీలోని ప్రతి పార్ట్ కి కూడా సర్జరీలు చేయించుకుని ఇక తమ బాడీ షేప్ ని తమకు నచ్చిన విధంగా మార్చుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇక కొంతమంది తమ గ్లామర్ను పెంచుకోవడానికి ప్రమాదకరమైన ఇంజక్షన్లు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. అయితే కొన్ని కొన్ని సార్లు గ్లామర్ను పెంచుతాయి అనుకున్న  సర్జరీలు ఇంజక్షన్లు చివరికి ఉన్న గ్లామర్ను పోగొట్టి అంద విహీనంగా  మార్చడం లాంటి ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయ్.

 ఇక్కడ ఒక యువతకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది అని చెప్పాలి. అప్పటికే ఆమె ఎంతో అందంగా ఉంటుంది. కానీ తన అందాన్ని మరింత పెంచుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే ఆ యువతి  చేసిన ప్రయత్నం కాస్త చివరికి వికటించింది. థాయిలాండ్ కు చెందిన 26 ఏళ్ల మాలి అనే యువతి మోడల్. అయితే తన బుగ్గలు లావు అయ్యాయని ఫీలింగ్ ఆమెకు వచ్చింది. దీంతో ఆపరేషన్ కోసం ఒక క్లినిక్ వెళ్ళింది.ఈ క్రమంలోనే అక్కడ వైద్యులు ఆమె బుగ్గల కు ఇంజక్షన్ చేయగా కాసేపటికి మంట మొదలైంది. ఇక తెల్లారేసరికి మొత్తం బొబ్బులు వచ్చి అంద విహీనంగా మారిపోయింది. నాణ్యతలేని ఇంజక్షన్ చేయడం వల్లే ఇలా జరిగిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: