విగ్గు పెట్టుకుని.. గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది ఈ భూమి మీద మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి ప్రత్యేకంగా సాధించాలని ఇక ఎప్పుడు తమ పేరు మారుమోగిపోయేలా చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఇక ఇలా రికార్డులు కొల్లగొట్టడానికి చాలామంది ఎన్నో రకాల మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తమ పేరును చూసుకోవాలని ఆశపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 గిన్నిస్ బుక్ లో రికార్డుల గురించి మాట్లాడుకోవడం ఈజీనే. కానీ ఈ రికార్డు సాధించడం ఎంతో కష్టమన్న విషయం అందరికీ తెలుసు. ఇక ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో ఏదైనా ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే గిన్నిస్ బుక్ రికార్డుల్లో మన పేరు కనబడేలా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించడానికి చేస్తున్న పనులు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రోజు చేసే పనులనే కాస్త విచిత్రంగా చేస్తూ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంటున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. ఏకంగా విగ్గు పెట్టుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు.

 అదేంటి విగ్ పెట్టుకోవడం ద్వారా కూడా గిన్నిస్ బుక్ సాధించవచ్చా అని అనుకుంటున్నారా.. అసలు విషయం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఒక కళాకారుడు భారీ విగ్ తయారు చేసి గిన్నిస్ రికార్డు కొట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన డాని రెనాల్ట్ అనే కళాకారుడు రెండు నెలలపాటు కష్టపడి 2.58 మీటర్లు అంటే 8 అడుగుల 6 అంగుళాల వెడల్పు ఉన్న విగ్ తయారు చేశాడు. తలపై ధరించి గిన్నిస్ రికార్డును సృష్టించాడు. గతంలో ది టునైట్ షోలో నటి డ్రు భారీ మోర్ ధరించిన 2.23 మీటర్ల విగ్ రికార్డును ఇక ఇప్పుడు డాని రెనాల్ట్  అధిగమించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: