పెళ్ళికాని ప్రసాదులకు.. అద్దెకు గర్ల్ ఫ్రెండ్.. ఎక్కడంటే?

praveen
సాధారణంగా ఇండియాలో పూర్వికుల నుంచి కొనసాగుతూ వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగానే ఇక ప్రతి మనిషి జీవనశైలి ముందుకు సాగుతూ ఉంటుంది. భారత్ ఎన్నో మతాల సమ్మేళనం అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ వారి మతాచారాలను పాటిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సాంప్రదాయాలు ఎంతో గొప్పగా ఉంటాయి అని చెప్పాలి. కానీ పాశ్చాత్య దేశాల్లో ఉన్న పోకడలు మాత్రం కొన్ని కొన్ని సార్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇలాంటి పాశ్చాత్య  పోకడలు ఇటీవల కాలంలో భారత్ లోకి కూడా పాకి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక కొన్ని కొన్ని సార్లు ఇలా వింతైన పాశ్చాత్య పోకడల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు. ఇప్పుడు చైనాలో  వింత పోకడ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. సాధారణంగా ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు.. అమ్మాయితోనే జీవితం అనుకున్నప్పుడు.. కలసి మెలసి ఉండడం సహజం. కానీ ఇక్కడ మాత్రం పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటున్న వారికి ఏకంగా అద్దెకు ప్రియురాలు దొరుకుతారు. అది ఎక్కడో కాదు భారత్ పొరుగు దేశమైన చైనాలో. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉన్నవారు ఒత్తిడిని తట్టుకునేందుకు అక్కడ రెంట్ గర్ల్ ఫ్రెండ్ వ్యవస్థను సృష్టించినట్లు తెలుస్తోంది.


 ఇప్పుడు ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయినట్లు అక్కడ వార్తాపత్రికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు తమ కొడుకుల పై ఒత్తిడి చేస్తూ ఉండడంతో.. ఎంతోమంది యువకులు అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి ఇక తల్లిదండ్రులకు చూపించి కొన్నాళ్లపాటు ఆగాలని పెళ్లిని వాయిదా వేస్తున్నారు అన్న విషయం ఇటీవల ఒక స్టింగ్ ఆపరేషన్ లో బయటికి వచ్చింది. ఇక ఇటీవల కాలంలో ఇలాంటి వింతైన పోకడ చైనాలో సర్వసాధారణంగా మారిపోయింది అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: