నిజమైన తుపాకీతో ఆడుకున్న పిల్లలు.. చివరికి?
అమెరికాకు వలస వెళ్లిన వారిని టార్గెట్‌గా చేసుకుంటున్న ఎంతోమంది దారుణంగా తుపాకులతో కాల్చి చంపుతున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ప్రభుత్వం ఇక గన్ కల్చర్ ను తగ్గించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ మాత్రం మార్పు రావడం లేదు. ఇక కొంతమంది అయితే చిన్న పిల్లలకు ఆడుకునేందుకు ఇచ్చే బొమ్మలకు బదులు ఏకంగా తుపాకులను చేతిలో పెడుతున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.
అగ్ర దేశమైన అమెరికాలో విపరీతంగా పెరిగిపోయిన గన్ కల్చర్ కారణంగా మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. తెలిసి తెలియని వయసులో మూడేళ్ల చిన్నారి గన్ తో ఆడుకుంటూ కాల్చడం కారణంగా చివరికి మరో చిన్నారి ప్రాణం పోయింది. నిజమైన తుపాకీని బొమ్మ తుపాకిగా భావించి అక్కా చెల్లెలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తుపాకీ పేలింది. దీంతో నాలుగేళ్ల చిన్నారి శరీరాన్ని బుల్లెట్ చీల్చేసింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో పెరిగిపోయిన గన్ కల్చర్‌కు ఈ ఘటన నిదర్శనంగా మారింది అని చెప్పాలి.