ట్విన్స్ గా పుట్టడం వల్లే.. గిన్నిస్ రికార్డు సాధించారు.. ఎలా అంటే?
ఇక వారిని చూసిన తర్వాత వారిద్దరూ కవలలు అంటే నమ్మడం కూడా కాస్త కష్టమే. అయితే ఇలాంటి తేడానే ఇక ఇప్పుడు వారిని అందరికంటే ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. ట్విన్స్ గా పుట్టిన ఇద్దరి మధ్య పోలికలు లేకపోవడంతో ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సాధించారు ఈ కవలలు. జపాన్లో ఇది వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఒకాయామాకు చెందిన యేసీ, మీషి అనే ఇద్దరు అమ్మాయిలు కూడా కవలలు. ఇక వారి వయస్సు ప్రస్తుతం 33 ఏళ్లు కావడం గమనార్హం. అయితే కవలలు అయినప్పటికీ వీరి రూపురేఖలు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఎత్తు పరంగా వారికి చాలా తేడా ఉంది.
యెషి అనే మహిళ 162.5 సెంటీమీటర్లు అంటే ఐదు అడుగుల నాలుగు అంగుళాలు ఉండగా.. మీషి మాత్రం 87.5 సెంటీమీటర్లు ఉంది అంటే రెండు అడుగుల 10 అంగుళాలు మాత్రమే. ఇక ఇలాంటి తేడానే ఇప్పుడు గిన్నిస్ బుక్ లో ఇద్దరు ట్విన్స్ రికార్డు సృష్టించేలా చేసింది అని చెప్పాలి. ప్రస్తుతం భూమ్మీద జీవించి ఉన్న కవలల ఎత్తులో ఇదే అత్యధిక వ్యాత్యాసం కావడం గమనార్హం. వీరిద్దరి మధ్య 75 సెంటీమీటర్ల తేడా ఉంది అని చెప్పాలి. ఎముక భాగానికి వచ్చిన రుగ్మత వల్ల మిషీ సాధరణ వ్యక్తుల్లా ఎదగలేకపోయింది. కాగా మొదట్లో నా ఎత్తు చూసుకొని నేను బాధపడేదాన్ని.. కానీ 2012లో నేను అతి తక్కువ ఎత్తు ఉన్న వ్యక్తి గురించి చదివి ఆశ్చర్యపోయాను అంటూ మిషి చెప్పుకొచ్చింది. అందరికంటే పొట్టిగా ఉండటమే అతని ప్రత్యేకత అని సదరు వ్యక్తి భావించేవాడు అంటూ తెలిపింది.